Monday, January 20, 2025

‘స్వాతిముత్యం’ సంక్రాంతి ట్రీట్ అదిరింది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు చిన్న కొడుకు గణేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘స్వాతిముత్యం’. ఈ మూవీని సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గణేష్ సరసన వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తోంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రావు రమేష్, నరేష్, ప్రగతి, సురేఖ వాణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Swathimuthyam First Glimpse Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News