Saturday, November 23, 2024

స్వాతి మలివాల్ ఘటన బిజెపి పన్నిన కుట్ర: మంత్రి అతిషి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బిజెపి, కేంద్ర సర్కార్ కుట్ర చేస్తోందని ఆప్ మంత్రి అతిషి తీవ్ర వ్యాఖ్యలు చేశార. ఢిల్లీలో సంచలనంగా మారిన ఆ పార్టీ ఎంపి స్వాతి మలివాల్ ఘటన అంతా బీజేపీ పన్నిన కుట్ర అని మంత్రి ఆరోపించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. స్వాతి మలివాల్‌పై ఏసీబీ(అవినీతి నిరోధక బ్యూరో)లో కేసు ఉన్నందున ఆమెను ఈ కుట్రలో పావుగా వాడుకుంటున్నారని ఆమె చెప్పారు.

ఇదీ బీజేపీ స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానమని మండిపడ్డారు. మహిళా రెజ్లర్లు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టిన్నప్పటికీ కోర్టు జోక్యం చేసుకునే వరకు మాజీ మంత్రి బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు. ఈ కేసులో సిఎం నివాసానికి భద్రతా ఉల్లంఘన, అతిక్రమణకు పాల్పడిన స్వాతి మలివాల్ పై సీఎం పిఎ బిభవ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. బిజెపి ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో తనపై ఆయన పిఎ బిభవ్ కుమార్ దాడి చేశాడని ఆరోపిస్తూ స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో సీఎం పిఎను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. దీంతో అతనికి కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News