Thursday, December 26, 2024

28న హేమంత్ సొరేన్ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

రాంచీ: జార్ఖండ్ నవంబర్ 28న ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, తృణమూల్  కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ, ఆర్ జెడి తేజస్వి యాదవ్ సహా ఇండియా బ్లాక్ కు చెందిన ప్రముఖ నాయకులందరూ హాజరు కానున్నారు.  జార్ఖండ్ లో 81 అసెంబ్లీ సీట్లలో జెఎంఎం సంకీర్ణం 56 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నది.

బిజెపికి చెందిన గంలియేల్ హెంబ్రోం ను 39791 ఓట్లతో సొరేన్ ఓడించి తన బర్హయిత్ సీటును దక్కించుకున్నారు. సొరేన్ ప్రమాణస్వీకారోత్సవం మొరబది గ్రౌండ్ లో జరుగనున్నది.

జార్ఖండ్ లో ఇండియా బ్లాక్ కు చెందిన జెఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్ జెడి  నాలుగు, సిపిఐ(ఎంఎల్) రెండు సీట్లు గెలుచుకున్నాయి. సొరేన్ గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వర్ ను కలుసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News