Saturday, December 21, 2024

ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు నియమితులు అయ్యారు. గురువారం వీరితో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లుగా ఉన్న సతీష్ చంద్ర శర్మ, ఆగస్టీన్ జార్జి మసిహ్, సందీప్ మెహతా సుప్రీంకోర్టు జడ్జిలుగా ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు జడ్జిలు, లాయర్లు, ఇతరులు హాజరయ్యారు. కొత్తగా వచ్చిన జడ్జిలతో ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.

ఇది సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి జడ్జిల బలానికి దారితీసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు అయిన వారిలో సతీష్ చంద్ర శర్మ ఇప్పటివరకూ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ ఆగస్టీన్ రాజస్థాన్ హైకోర్టు సిజెగా, సందీప్ మెహతా గువహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ ముగ్గురు పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం మూడు రోజుల క్రితం సిఫార్సు చేసింది. వీరి నియామకాలను నిర్థారిస్తూ న్యాయమూర్తి అర్జున్ రామ్ మెఘ్వాల్ ప్రకటన వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News