Wednesday, January 22, 2025

యుపిలో నలుగురు కొత్త మంత్రుల ప్రమాణం

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్ ప్రదేవ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. బిజెపికి చెందిన ఇద్దరు, ఆర్‌ఎల్‌డి, ఎస్‌బిఎస్‌పి నుంచి ఒకరు చొప్పున మొత్తం నలుగురు మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదిత్యనాథ్ తన మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది మొదటిసారి. గత ఏడాది సమాజ్‌వాది పార్టీలో చేరి కొద్ది కాలం ఉండి తిరిగి సొంతగూడికి చేరుకున్న బిజెపి ఎంఎల్‌సి దారా సింగ్ చౌహాన్‌తోపాటు బిజెపి ఎమ్మెల్యే సునీల్ కుమార్ శర్మ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆర్‌ఎల్ ఎమ్మెల్యే పుర్కాజీ, సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బిఎస్‌పి) అధిపతి ఓపి ఆజ్‌బీర్ కొత్త మంత్రులుగా ప్రమాణం చేశారు. ఉత్తర ప్రదేశ్ క్యాబినెట్‌లో ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలుపుకుని 52 మంది సభ్యులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News