Friday, December 20, 2024

రతి క్రీడను క్రీడగా గుర్తించిన స్వీడెన్

- Advertisement -
- Advertisement -
జూన్‌లో తొలి సెక్స్ ఛాంపియన్‌షిప్ నిర్వహించబోతున్నది!

స్టాక్‌హోం: యూరొపియన్ దేశాల్లో ఒకటైన స్వీడెన్ జూన్ నెలలో తొలిసారి ‘సెక్స్ ఛాంపియన్‌షిప్’ నిర్వహించబోతున్నది. ఆరు వారాలపాటు జరిగే ఈ పోటీ జూన్ 8న గోథెన్‌బర్గ్‌లో నిర్వహించనున్నారు. స్వీడిష్ సెక్స్ సమాఖ్య మార్గదర్వకత్వంలో ఈ పోటీ జరుగనున్నది. వివిధ మీడియా నివేదికల ప్రకారం ఈవెంట్‌లో పాల్గొనేవారు లోబరుచుకోవడం(సెడక్షన్), శరీర మర్దనం(బాడీ మసాజ్), ఫోర్‌ప్లే తదితరములతో సహా 16 విభాగాలలో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటారు.

వివిధ దేశాలకు చెందిన 20 మంది పాల్గొనే అవకాశం ఉన్న ఈ పోటీలో ప్రతి రోజు ఆరు గంటల సెషన్‌లు ఉంటాయి. ఒక్కో జంటకు 45 నుంచి 60 నిమిషాలు కేటాయిస్తారు. ఈ పోటీకి ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ కూడా ఉంటుంది. వారు ప్రేక్షకులతో కలిసి విజేతలను నిర్ణయిస్తారు. ఈ పోటీలు వివిధ సెక్సువల్ ఓరియెంటేషన్‌ను ప్రోత్సాహిస్తాయి.

‘క్రీడా వ్యూహాల్లో భాగంగా లైంగిక ధోరణిని(సెక్సువల్ ఓరియెంటేషన్) చేర్చడం ఐరోపా దేశాలలో సంచలనాత్మక అభివృద్ధి కాగలదు’ అని  స్వీడిష్ ఫెడరేషన్ ఆఫ్ సెక్స్ అధిపతి డ్రాగన్ బ్రాటిచ్ పేర్కొన్నట్లు వార్త.

స్వీడిష్ క్రీడా సమాఖ్య రతిక్రీడను క్రీడగా గుర్తించలేదని ధృవీకరించింది, ఈ పోటీ జరుగుతుందా లేదా అనేది ఇప్పటికీ ధృవీకరించబడలేదు!

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News