Friday, December 20, 2024

పాకిస్థాన్‌లో ఎంబసీని మూసేయనున్న స్వీడెన్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధానిలో భద్రతా పరిస్థితి దృష్టా స్వీడెన్ తన రాయబార కార్యాలయంను(ఎంబసీ) మూసేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఎలాంటి ముప్పు పొంచివుందన్న విషయాన్ని ఎంబసీ తెలుపలేదు. కానీ పాకిస్థాన్‌లో రాజకీయ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు మధ్య ఉద్రిక్తత కారణంగా అక్కడ రాజకీయ పరిస్థితి మరింత దిగజారింది.

‘ఇస్లామాబాద్‌లో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితి దృష్టా స్వీడెన్ తన రాయబారకార్యాలయాన్ని సందర్శకులకు మూసేస్తోంది. ప్రస్తుతం మైగ్రేషన్ సెక్షన్ ఎలాంటి వినతులను పరిశీలించే స్థితిలో లేదు’ అని స్వీడెన్ ఎంబసీ తన వెబ్‌సైట్‌లో పెట్టింది.
చాలా మంది స్వీడెన్‌లో ఖురాన్ దగ్ధం చేసిన దృష్టా తలెత్తిన పరిస్థితుల దృష్టా పాకిస్థాన్‌లో స్వీడెన్ తన రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకుని ఉంటుందని భావిస్తున్నారు. జనవరి 21న స్టాక్‌హోమ్‌లోని టర్కీ రాయబారకార్యాలయం ముందు ఖురాన్ గ్రంథం ప్రతిని డానిష్‌స్వీడిష్ అతివాదులు దగ్ధం చేశారన్నది ఇక్కడ గమనార్హం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఖండించారు. పాకిస్థాన్‌లోని ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఆ ఘటనను ఖండించారు.

పాకిస్థాన్‌లో చైనా తన రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసేసింది. అందుకు సాంకేతిక కారణాలను పేర్కొంది. పాకిస్థాన్‌లో దిగజారుతున్న భద్రతా పరిస్థితుల దృష్టా జాగ్రత్తగా ఉండాలని అక్కడి చైనీయులను చైనా హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News