- Advertisement -
ఫిన్‌ల్యాండ్ కూడా అదేదారిలో
స్టాక్‌హోమ్: నాటో కూటమిలో చేరేందుకు స్వీడన్ అభ్యర్థనా పత్రంపై మంగళవారం లాంఛనప్రాయంగా సంతకం చేసింది. 30 సభ్యదేశాల సైనిక కూటమి నాటోలో సభ్యత్వం పొందనున్నట్లు స్వీడన్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా..స్వీడన్‌కు పొరుగు దేశమైన ఫిన్‌ల్యాండ్ కూడా నాటోలో చేరేందుకు సంసిద్ధమవుతోంది. నాటోలో చేరాలని ఈ రెండు దేశాలు తీసుకున్న నిర్ణయంపై రష్యా మండిపడుతోంది. కాగా..ఈ రెండు దేశాల చేరికను నాటోలోని మెజారిటీ సభ్యులు స్వాగతిస్తుండగా టర్కీ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది. కుర్దిష్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఈ రెండు దేశాలు వారిని తమకు అప్పగించడానికి నిరాకరించడాన్ని టర్కీ తప్పుపడుతోంది.
- Advertisement -