Sunday, December 22, 2024

పంద్రాగస్టు రోజున ఆర్టీసి ఉద్యోగులకు తీపి కబురు

- Advertisement -
- Advertisement -

Sweet chat for TS RTC employees

సెప్టెంబర్ నెల జీతంతో పాటు మరో డిఏను అందిస్తాం
పెండింగ్‌లో ఉన్న రూ.1,000 కోట్ల బకాయిలను త్వరలోనే ఉద్యోగులకు చెల్లిస్తాం
ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

మనతెలంగాణ/హైదరాబాద్ : పంద్రాగస్టు రోజున ఆర్టీసి ఉద్యోగులకు చైర్మన్ అండ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీపి కబురు అందించారు. సెప్టెంబర్ నెల జీతభత్యాలతో పాటు మరో డిఏను అందిస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో మాట్లాడి అతి త్వరలోనే రూ.1,000 కోట్ల ఉద్యోగుల బకాయిలను చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ బస్‌భవన్ ప్రధాన కార్యాలయంలో ఆర్టీసి పోలీసు సిబ్బంది కవాతును, గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం ఆర్టీసి వైస్ చైర్మన్, ఎండి, విసి సజ్జనార్‌లతో కలిసి చైర్మన్, బాజిరెడ్డి గోవర్ధన్ భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1932 నాటి ‘డెక్కన్ క్వీన్‘ అల్బినియన్ బస్సు గురించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి కెటిఆర్‌లకు నిజాం కాలం నాటి బస్సు చరిత్రను వివరిస్తానన్నారు. మహానగరంలో ప్రధాన రోడ్డు మార్గాల్లో నిజాం కాలం నాటి బస్సును ప్రదర్శిస్తామని ఆయన తెలియజేశారు. ఆర్టీసి సంస్థ ఉద్యోగులకు ముఖ్యమంత్రి సహకారంతో అండగా ఉంటామని ఆయన తెలియచేశారు.

బిడబ్లూఎస్ పథకం ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ

ఆర్టీసిలో బిడబ్లూఎస్ పథకం ద్వారా త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. రానున్న రోజుల్లో 300 ఎలక్ట్రికల్ బస్సులతో పాటు కమర్షియల్ రెవెన్యూ కోసం అతి త్వరలోనే సొంత బ్రాండ్‌తో ఆర్టీసి జీవా (ZIVA) వాటర్ బాటిళ్లను ప్రారంభించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎండి విసి సజ్జనార్ సారథ్యంలో ఈడీలు, ఆర్‌ఎంలు, డిప్యూటీ ఆర్‌ఎంలు డిఎంలు, డ్రైవర్లు, కండక్టర్లు డిపో మెకానికల్ సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారని ఆయన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నిజాం రోడ్డు రవాణా విభాగంలో పని చేసిన మాజీ ఉద్యో గులు , కురవృద్ధులు టి.ఎల్. నరసింహ (97), ఎం .సత్తయ్య (92)లకు ఘన సన్మానం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి అధికారులు సిఓఓ రవీందర్, ఈడి ఈ వినోద్, సిపిఎం యుగేందర్, హెచ్‌ఓడీలు, ఆర్టీసి సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News