Tuesday, January 7, 2025

తెలంగాణ ఉద్యమం నాటి మధుర జ్ఞాపకాలు : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమం నాటి మధుర జ్ఞాపకాలు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి జ్ఞప్తికి తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం యావన్మందీ ఉద్యమంలో భాగస్వాములయ్యారనీ, ఆ ఉద్యమంలో తాను కూడా ఒకరినై ఉద్యమించడం ముదావహంగా ఉందన్నారు. 2006లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తాను పాలుపంచుకున్న ఫోటోలను ఆయన తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఆనాటి తన మధుర జ్ఞాపకాలను మరల గుర్తుకు తెచ్చుకుంటూ తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి ఒక్కరూ రాష్ట్ర సాధన కోసం ముందడుగు వేశారన్నారు. ఊరు వాడా ఏకమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్షంగా ఉద్యమించిందన్నారు. అలాంటి మహత్తర ఉద్యమంలో తాను పాల్గొని రాష్ట్ర సాధనలో ముందుండి నడవడం నిజంగా తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ఆనాటి ఉద్యమస్ఫూర్తిని నేటికి సిఎం కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆయనఅన్నారు. ముందు కూడా ఈ ఉద్యమ స్ఫూర్తిని ఇదే విధంగా కొనసాగించగలనని ఆనాటి ఉద్యమంలో తాను పాలుపంచుకున్న ఉద్యమ దృశ్యాలతో కూడిన ఫోటోను ఆయన తన ట్విట్టర్‌లో పొందుపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News