Monday, December 23, 2024

కేంద్ర సర్వీస్‌లకు శ్వేతామహంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారిని శ్వేతామహంతిని కేంద్ర సర్వీస్‌లకు బదలాయించారు. నాలుగేళ్లపాటు కేంద్ర సర్వీస్‌లో పని చేసేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఢిల్లీలోని క్యాబినెట్ సెక్రటరీలో డిప్యూటీ సెక్రటరీగా ఆమెను నియమించినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. 2011 కేడర్‌కు చెందిన శ్వేత మహంతి ప్రస్తుతం కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు హైదరాబాద్, వనపర్తి జిల్లాలకు కలెక్టర్ వ్యవహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News