జిహెచ్‌ఎంసి కౌన్సిల్ హాల్‌ను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి శ్వేత మహాంతి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: జిహెచ్‌ఎంసి కొత్త పాలకమండలి ఏర్పాటుకు సంబంధించి అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈనెల 11న నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్‌ల పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకు గాను ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల ప్రక్రియ సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత మహాంతి గురువారం అధికారులతో సమిక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కౌన్సిల్ హాల్‌ను ఆమె క్షుణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్స్‌ఆఫిషీయో సభ్యులు, కార్పొరేటర్లకు పార్టీల వారిగా సీట్ల కేటాయింపు, కౌన్సిల్ హాల్ ప్రవేశం, మీడియా ఎన్‌క్లోజర్‌ను పరిశీలించారు. 11న నిర్వహించనున్న సమావేశాన్ని పూర్తి స్తాయిలో వీడియోగ్రఫీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధింత అధికారులను శ్వేత మహాంతి ఆదేశించారు.
Sweta Mohanty inspecting at GHMC Council Hall