Monday, December 23, 2024

స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌ను ఢీకొని ఈడ్చుకెళ్లిన కారు

- Advertisement -
- Advertisement -

నోయిడా: ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో ద్విచక్రవాహనంపై వెళుతున్న అంజలీ సింగ్ అనే యువతిని ఒక కారు బలిగొన్న తరహాలోనే అదే రోజున నోయిడాలో ఒక స్విగ్గీ డెలివరీ ఏజెంట్ కూడా ప్రాణాలు కోల్పాయాడు. అతడు నడుపుతున్న టూవీలర్‌ను కారు ఢీకొని దాదాపు 500 మీటర్లు ఈడ్చుకెళ్లింది. కొత్త సంవత్సరం రోజు జనవరి 1 రాత్రి నోయిడాలోని సెక్టార్ 14లోని ఫ్లైఓవర్ సమీపాన స్విగ్గీ డెలివరీ ఏజెంట్ కౌశల్ ఫుడ్ డెలివరీ చేయడానికి వెళుతుండగా అతడి ద్విచక్రవాహనాన్ని ఒక కారు ఢీకొంది.

ప్రమాదం జరిగిన ప్రదేశానికి 500 మీటర్ల దూరం వరకు కౌశల్‌ను ఈడ్చుకెళ్లిన కారు ఒక ఆలయ సమీపంలో ఆగింది. కారుతోపాటు కౌశల్ మృతదేహాన్ని అక్కడే వదిలి కారులోని వ్యక్తి పరారయ్యాడు. రాత్రి ఒంటిగంట సమయంలో కౌశల్ సోదరుడు అమిత్ ఫోన్ చేయడంతో ఈ సంఘటన వెలుగుచూసింది. సంఘటన స్థలం వద్ద ఉన్న ఒక వ్యక్తి అమిత్ ఫోన్‌కాల్‌కు స్పందించి సమాచారం అందచేశాడు. అమిత్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సిసిటివి కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News