Tuesday, December 24, 2024

వాటర్ ట్యాంకర్ ఢీకొని స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి

- Advertisement -
- Advertisement -

మాదాపూర్ ః వాటర్ ట్యాంకర్ ఢీ కొని స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆకుల దుర్గాప్రసాద్ తండ్రి సత్యనారాయణ (40) స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన మధ్యహ్నం సమయంలో మాదాపూర్ శిల్పారామం ముందు నుండి తన బైక్ ఎపి 09 బిడబ్లు 0368పై వెళ్తూ సైబర్ టవర్ గేట్ మందు యు టర్న్ తీసుకుంటున్నారు.

ఆ సమయంలో కూకట్‌పల్లి వైపు నుండి వస్తున్న వాటర్ ట్యాంకర్ టిఎస్ 12 యుసి 3081 గల దాని డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్షంగా నడుపుతూ స్విగ్గీ డెలివరీ బాయ్ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్ రోడ్డుపై పడిపోవడంతో అతనిపై నుండి వాటర్ ట్యాంకర్ వెళ్లింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్‌కు తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News