Friday, December 20, 2024

కత్తితో దాడి చేసిన స్విగ్గి డెలివరీ బాయ్

- Advertisement -
- Advertisement -

Swiggy delivery boy who was attacked with knife on customer

పేమెంట్ విషయంలో కస్టమర్‌తో వాగ్వాదం
బాధితుడి పరిస్థితి విషమం, పరారీలో డెలివరీ బాయ్
కేసు దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు

మనతెలంగాణ, హైదరాబాద్ : ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్‌ను డెలివరీ బాయ్ కత్తితో పొడిచిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…నానక్‌రామ్‌గూడలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న శివప్రసాద్ అలియాస్ ఆదిత్య అనే వ్యక్తి స్విగ్గిలో ఫుడ్‌ను ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ ఆర్డర్‌ను తీసుకుని వచ్చాడు. అయితే పేమెంట్ విషయంతో ఆదత్యకు డెలివరీ బాయ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరు కొట్టుకోవడంతో ఆగ్రహం చెందిన డెలివరీ బాయ్ కత్తితో ఆదిత్యను పొడిచాడు. అక్కడి నుంచి పారిపోయాడు, డెలివరీ బాయ్‌కు కూడా గాయాలైనట్లు తెలిసింది. కస్టమర్ శిప్రసాద్‌కు గాయాలు కావడంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News