భారతదేశపు మార్గదర్శకపు ఆన్–డిమాండ్ ఆన్ లైన్ వ్యవస్థ, స్విగ్గీ, (స్విగ్గీ లిమిటెడ్, NSE: స్విగ్గీ/BSE: 544285), కొనసాగుతున్న క్రికెట్ సీజన్ యొక్క ఉత్సాహాన్ని పెంచడానికి రూపొందించబడిన స్విగ్గీ సిక్సెస్ – వాస్తవిక సమయంలో, మ్యాచ్ తో లింక్ చేయబడిన ఆఫర్ ను ప్రారంభించింది. మీరు అభిమానించే రెస్టారెంట్లలో అత్యధిక ఆఫర్లు పొందండి. దేశంలో క్రికెట్ ఉత్సాహం ఊపందుకోవడంతో, స్విగ్గీ సిక్సెస్ ఎత్తుగా ఎగిరి వెళ్లే ప్రతి సిక్స్ అభిమానులు గొప్ప ఫుడ్ డీల్స్ తో సంబరం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది, ఆటలోని ప్రతి క్షణానికి రుచిని చేరుస్తోంది.
స్విగ్గీ సిక్సెస్ తో యూజర్లు దేశవ్యాప్తంగా ఉన్న 50,000 రెస్టారెంట్లలో ఆర్డర్లు చేసినప్పుడు ఉత్తేజభరితమైన డిస్కౌంట్లు – 66% తగ్గింపు, ₹266 తగ్గింపు, ₹166 తగ్గింపు లేదా ₹66 తగ్గింపును పొందవచ్చు. లైవ్ క్రికెట్ మ్యాచ్ సమయంలో సిక్స్ కొట్టిన క్షణమే ఈ పరిమిత సమయం ఆఫర్లు యాక్టివేట్ అవుతాయి మరియు కేవలం పది నిముషాలు మాత్రమే చెల్లుతాయి. “సిక్స్ కొట్టారు! ఆఫర్ ప్రారంభమైంది“ వంటి అలర్ట్స్ తో స్విగ్గీ యాప్ లో వాస్తవిక సమయంలో” బాల్ ఫ్లోటీ“ టైమర్ కనిపిస్తుంది, ఇది యూజర్లు సులభంగా లైవ్ అన్ లాక్స్ ను అనుసరించడానికి అనుమతిస్తుంది.
ఆఫర్ ను పొందడానికి, సిక్స్ కొట్టిన తరువాత 10 నిముషాల విండో సమయం లోగా యూజర్లు తమ ఆర్డర్ ను చేయాలి. చెక్ అవుట్ తో సహా పూర్తి ఆర్డర్ ప్రయాణం ఈ వ్యవధిలో పూర్తి కావాలి. సకాలంలో బహుమతులు మరియు చేర్చబడిన సౌకర్యంతో మ్యాచ్ అనుభవాన్ని పెంచడానికి ఈ పరిమిత సమయం ఫీచర్ రూపొందించబడింది.
కాంపైన్ గురించి మాట్లాడుతూ, సిద్ధార్థ భాకూ, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్, ఇలా అన్నారు, “మా వినియోగదారుల కోసం రోజూవారీ క్షణాలను మెరుగుపరచడానికి మేము అనుకూలమైన మార్గాలను నిరంతరంగా అన్వేషిస్తుంటాం. స్విగ్గీ సిక్సెస్ తో, మేము మ్యాచ్ అనుభవాన్ని మరింత ఆనందదాయకంగా మరియు పాల్గొనే విధంగా చేసే ఉత్తేజం మరియు ఆశ్చర్యాలను చేర్చడం ద్వారా భారతదేశం ఇష్టపడే రెండు విషయాలను ఒక చోట చేర్చాము- అవి ఆహారం, క్రికెట్.”