Wednesday, January 22, 2025

ఈత, తాటి వనాలను విరివిగా పెంచాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి:కల్లుగీత వృత్తి పరిరక్షణ కోసం తాటి, ఈత, ఖర్జూర వనాలను విరివిగా పెంచాలని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ అన్నారు. చౌటుప్పల్ మండలంలోని జై కేసారం పరిధిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ఈత, తాటి, ఖర్జూర వనాలను శనివారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను పరిరక్షించు కోవాలని సొసైటీ సభ్యులకు సూచించారు. త్వరలో చేపట్టబోయే హరితహారంలో భాగంగా మరిన్ని మొక్కలను నాటాలన్నారు. ఈ వనం దగ్గరికి రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు చుట్టూ రక్షణ కోసం ఫినిషింగ్ కూడా వేయిస్తానని రవికుమార్ తెలిపారు.

అలాగే అన్యాక్రాంతం అవుతున్న సొసైటీ స్థలాన్ని కాపాడాలని సభ్యులు ఛైర్మన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పల్లె మల్లయ్య, రాగీరు కిష్టయ్య, ఆకిటి నర్సింహ్మ, యాదయ్య, జంగయ్య, మధు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News