Wednesday, January 22, 2025

పుట్టిన రోజునాడు ప్రాణం తీసిన ఈత సరదా

- Advertisement -
- Advertisement -

Swimming fun that took life on the day of birth

చిర్యాల్ నాట్కం చెరువులో ముగ్గురు విద్యార్థులు మృతి

మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల్ గ్రామంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చిర్యాల్ నాట్కం చెరువులో మునిగి చనిపోయారు. ఇవాళ హరహరన్, ఉబేద్ అనే ఇద్దరు విద్యార్థుల బర్త్ డే సందర్భంగా.. తొమ్మిది మంది విద్యార్థులు చిర్యాల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి వెళ్లే సమయంలో సరదాగా ఈత కొట్టేందుకు చిర్యాల నాట్కం చెరువుకు వెళ్లారు. ఈత కొడుతుండగా ముగ్గురు విద్యార్థులు నాట్కం చెరువులో గల్లంతయ్యారు. మిగతా విద్యార్థులు చూస్తుండగానే ముగ్గురూ నీటిలో మునిగిపోయారు.

తొమ్మిది మంది విద్యార్థులు తీగల కృష్ణారెడ్డి కళాశాలకు చెందిన వారు. వీరంతా డిప్లోమా థర్డ్ ఇయర్ చదువుతున్నారు. విషయం తెలియగానే కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలాజీ అనే విద్యార్థి డెడ్ బాడీని చెరువు నుంచి బయటకు వెలికితీశారు. మిగతా ఇద్దరు విద్యార్థుల మృతదేహాల కోసం స్థానికుల సహయంతో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చనిపోయిన వారిలో హరిహరన్, ఉబేద్, బాలాజీ ఉన్నారు. మిగతా ఆరుగురు విద్యార్థులను కీసర పోలీసుల అదుపులో ఉన్నారు. కుమారుల మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News