Monday, January 20, 2025

స్విమ్మింగ్ సందడి షురూ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వేసవి కాలం ప్రారంభం కావడంతో జంట నగరాల్లోని స్విమ్మింగ్ పూల్‌లలో సందడి వాతావరణం నెలకొంది. జిహెచ్‌ఎంసి పరిధిలోని పలు స్విమ్మింగ్స్ పూల్‌లు ఇప్పటికే తెరచుకున్నాయి. సికింద్రాబాద్, మొఘల్‌పురా, సనత్ నగర్, ఎల్‌బి స్టేడియం, గచ్చిబౌలి తదితర స్టేడియాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు జలకలాటల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో వార్షిక పరీక్షలు ముగియడంతో విద్యార్థులు స్విమ్మింగ్ పూల్‌ల బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌లోని అన్ని స్విమ్మింగ్ పూల్‌లు క్రీడాకారులతో కిటకిటలాడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News