బ్రాసెల్: ప్రతిష్టాత్మకమైన స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు పి.వి.సింధు, హెచ్‌ఎస్. ప్రణయ్ ఫైనల్‌కు చేరుకున్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సింధు, పురుషుల విభాగంలో అన్‌సీడెడ్ ప్రణయ్‌లు జయకేతనం ఎగుర వేశారు. కొంతకాలంగా పేలవమైన ఆటతో సతమతమవుతున్న సింధు స్విస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరడం విశేషం. శనివారం థాయిలాండ్ క్రీడాకారిణి సుపానిదా కతెథోంగ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో తెలుగుతేజం సింధు విజయం సాధించింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో సింధు 2118, 1521, 2119 తేడాతో సుపానిదాను ఓడించింది. ఆరంభం నుంచే పోటీ ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. తొలి గేమ్‌లో సింధు పైచేయి సాధించింది.
చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ సెట్‌ను గెలుచుకుంది. కానీ రెండో గేమ్‌లో భారత స్టార్‌కు చుక్కెదురైంది. ఈసారి ప్రత్యర్థి షట్లర్ విజయం సాధించింది. ఇక ఫలితాన్ని తేల్చే చివరి గేమ్‌లోనూ పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇద్దరు సర్వం ఒడ్డడంతో ఫలితం తరచూ చేతులు మారుతూ వచ్చింది. అయితే చివర్లో వరుసగా మూడు పాయింట్లు సాధించిన సింధు సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి టైటిల్ పోరుకు చేరుకుంది. ఇక ప్రణయ్ కూడా సెమీస్‌లో చెమటోడ్చి నెగ్గాడు. ఇండోనేషియాకు చెందిన మూడో సీడ్ ఆంథోనీతో జరిగిన హోరాహోరీ పోరులో ప్రణయ్ 2119, 1921, 2118 తేడాతో విజయం సాధించాడు. తొలి గేమ్‌లో ప్రణయ్ గెలవగా రెండో సెట్‌ను ఆంథోనీ దక్కించుకున్నాడు. అయితే చివరి సెట్‌లో ప్రణయ్ జయకేతనం ఎగుర వేసి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.