Friday, January 24, 2025

వంద బోగీలు… 1.9 కిలోమీటర్ల పొడవు

- Advertisement -
- Advertisement -

Swiss Railways completes 175 years

ప్రపంచంలో అత్యంత పొడవైన
ప్యాసింజర్ రైలును నడిపిన స్విస్ కంపెనీ

జెనీవా: స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ రైల్వే కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయాణికుల రైలును నడిపి రికార్డు సృష్టించింది. అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవైన ఆల్ప్ పర్వతాల గుండా వెళ్లే రైలుమార్గంపై శనివారం ఈ రైలును నడిపింది. రయేటియన్ రైల్వే కంపెనీ వంద బోగీలు ఉండే సుమారు 1.9 కిలోమీటర్లు పొడవుండే ఈ రైలును ప్రెడానుంచి మెర్గూన్ దాకా అల్బులా/బెర్నియా మార్గం గుండా నడిపింది. ఈ రైలుమార్గాన్ని 2008లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాంతంగా ప్రకటించింది. 22 సొరంగాలగుండా ఈ మార్గం వెళుతుంది. పర్వతాల మీదుగా పాము మెలికలు తిరిగినట్లుగా ఉండే ఈ రైలుమార్గంలో 48 వంతెనలు కూడా ఉన్నాయి. మొత్తం ప్రయాణం గంట సేపు సాగింది. ఆల్ప్ పర్వతాల గుండా 25 కిలోమీటర్ల పొడవునా సాగిన ఈ రైలు ప్రయాణాన్ని తిలకించడానికి జనం పెద్ద సంఖ్యలో రైలుమార్గం పొడవునా బారులు తీరారు. స్విట్జర్లాండ్ ఇంజనీర్లు సాధించిన విజయాలను హైలెట్ చేయడానికి, అలాగే స్విస్ రైల్వేస్ 175 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రికార్డు ప్రయత్నాన్ని చేపట్టినట్లు రయేటియన్ రైల్వే డైరెక్టర్ రెనాటోఫాసియాటి చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News