Tuesday, December 3, 2024

ఏడాది పొడవునా ప్రయాణ గమ్యస్థానంగా స్విట్జర్లాండ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : స్విట్జర్లాండ్ టూరిజం బోర్డు హైదరాబాద్‌లోని హయత్ ప్లేస్‌లో స్విట్జర్లాండ్ టూరిజం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒకప్పుడు వేసవి గమ్యస్థానంగా మాత్రమే ఉన్న స్విట్జర్లాండ్ ఇప్పుడు అన్ని సీజన్లలో కూడా భారతీయ పర్యాటకులకు అనువుగా మారింది. మహమ్మారి తర్వాత భారతదేశం నుండి ఎక్కువ మంది ప్రయాణికులను తాము చూస్తున్నామని, పర్యాటకాన్ని మరింత పర్యావరణ అనుకూలంగా మలచాలనే మా లక్ష్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నారని ఈస్ట్ మార్కెట్స్ చీఫ్ మార్కెట్స్ ఆఫీసర్ సైమన్ బోషార్ట్ అన్నారు.

యాత్రలు స్విట్జర్లాండ్‌లో గతంలో కంటే ఎక్కువగా విస్తరించాయి.- స్విట్జర్లాండ్‌లో గడిపిన ఓవర్‌నైట్‌ల సంఖ్యలో 2019 కంటే 2023 మెరుగ్గా ఉంది. వసతి, ముందస్తుగా బుకింగ్ చూస్తున్నామని అన్నారు. భారతీయులు ఎక్కువగా జ్యూరిచ్, లూసెర్న్, ఇంటర్‌లాకెన్ వంటి నగరాలకు వెళతారు, అయితే జెర్మాట్ – మాటర్‌హార్న్ అలాగే ఇటాలియన్ మాట్లాడే ప్రాంతం టిసినో వంటి ప్రదేశాలను కూడా సందర్శించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్విట్జర్లాండ్ టూరిజం ఇప్పుడు తమ స్నేహ పూర్వక రాయబారిగా నీరజ్ చోప్రాతో ఒప్పందం కుదుర్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News