Monday, December 23, 2024

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం ఎస్‌వోటి పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ : కల్తీ అల్లం వెల్లులి తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా ప్రజల ప్రాణాలకు హానికరమైన కల్తీ ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాజేంద్రనగర్ ఎస్‌వోటి పోలీసులు పక్కా సమాచారంతో ఈ కల్తీ అల్లం వెల్లులి పేస్ట్ తయారీ కేంద్రం పై దాడి నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. అత్తాపూర్‌లో కల్తీ అల్లం వెల్లులి పేస్ట్ తయారీ కేంద్రం కొహినూర్ బ్రాండ్ పేరుతో రసా యనాలు ఉపయోగించి అల్లం వెల్లులి పేస్ట్ సిద్దం చేస్తున్నారు.

ఆకర్శినీయంగా ప్యాక్ చేసి మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు నిర్వాహకులు. ఈ విషయం ఎస్‌వోటి పోలీసులకు సమాచారం అందింది. దాంతో తయారీ కేంద్రం పై దాడి చేసి కుల్లిపోయిన అల్లం వెల్లులితోపాటు కనీసం పొట్టుకుడా తీయకుండా తాజాగా అనిపించేలా కొన్ని రకాల రసాయనాలు కలుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏలాంటి అనుమతి, ఫుడ్ సెఫ్టీ నియయమాలు పాటించకుండా కొహినూర్ బ్రాండ్ పేటిన ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకోవడంతో పాటు కల్తీ అల్లం వెల్లులి పేస్ట్ తో పాటు తయారీలో వినియోగించే ర సాయనాలను స్వాధీనం చేసుకున్న ఎస్‌వోటి పోలీసులు తదుపరి విచారణ నిమ్మిత్తం అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News