Wednesday, January 22, 2025

టి20లో ఇద్రుస్ నయా చరిత్ర

- Advertisement -
- Advertisement -

కౌలాలంపూర్: టి20 ఫార్మాట్‌లో మలేసియా ఫాస్ట్ ఫాస్ట్ బౌలర్ ఇద్రుస్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టి20 202 ప్రపంచకప్ ఆసియా రీజనల్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌లో భాగంగా చైనాతో జరిగిన మ్యాచ్‌లో ఇద్రుస్ 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టి20 ఫార్మాట్‌లో ఏడు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో ఏ బౌలర్ కూడా ఏడు వికెట్ల తీయలేదు. అయితే తాజాగా ఇద్రుస్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఇద్రుస్ ధాటికి చైనా 23 పరుగులకే కుప్పకూలింది. ఈ లక్ష్యాన్ని మలేసియా 4.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News