- Advertisement -
న్యూయార్క్: ఆస్కార్ అవార్డును అందుకున్న మొదటి నల్లజాతి నటుడు సిడ్నీ పోయిటియర్(94) కన్నుమూశారు. లిల్లీస్ ఆఫ్ ద ఫీల్డ్‌లో తన నటనకు 1964లో ఉత్తమ నటుడిగా సిడ్నీ ఈ అవార్డు అందుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం లాస్ ఏంజెల్స్‌లో సిడ్నీ తుదిశ్వాస విడిచారని బహ్మాస్ ప్రధానికి సమాచార డైరెక్టర్ అయిన ల్యాట్రే రాహ్‌మింగ్ తెలిపారు. సిడ్నీ మృతి పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం తెలిపారు. చలనచిత్రాల శక్తి తమను దగ్గరకు చేర్చిందని ఒబామా తన సంతాప సందేశంలో తెలిపారు. సిడ్నీ తండ్రి బహ్మాస్‌కు చెందిన టమాట రైతు కుటుంబానికి చెందినవారు. సిడ్నీ పుట్టి పెరిగింది మాత్రం అమెరికాలోనే. సిడ్నీ ది డెఫియంట్ ఒన్స్, ఎ ప్యాచ్ ఆఫ్ బ్లూ, ఎ రైజిన్ ఇన్ ద సన్‌లాంటి పలు చిత్రాల్లో నటించారు.
- Advertisement -