హైదరాబాద్: 1971లో ఓవెల్‌లో భారత్ గెలిచిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌లో సభ్యుడైన సయ్యద్ అబిద్ అలీ(83) కన్నుమూశారు. హైదరాబాద్‌కు చెందిన అబిద్ అలీ బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. ఈ మాజీ ఆల్‌రౌండర్ భారత్ తరఫున 29 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. తన కెరీర్‌లో 47 వికెట్లు పడగొట్టారు. 1967లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో ఆరంగేట్రం చేసిన అబిద్.. ఆ మ్యాచ్‌లో 55 ఇచ్చి.. 6 వికెట్లు పడగొట్టారు. అదే సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో 78, 81 పరుగులు చేశారు. 1974 వరకూ సాగిన ఆయన టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో 47 వికెట్లు తీసి.. 1018 పరుగులు చేశారు. మరోవైపు ఆయన తన కెరీర్‌లో 5 వన్డేలు మాత్రమే ఆడారు. అందులో మూడు తొలి వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు కావడం విశేషం. న్యూజిలాండ్‌తో జరిగిన ఆయన చివరి వన్డే మ్యాచ్‌లో ఆయన 98 బంతుల్లో 70 పరుగులు చేశారు. అబిద్ అలీ మృతికి టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. ఆయన మరణవార్త ఎంతో బాధించిందని గవాస్కర్ పేర్కొన్నారు. అబిద్ అలీ కుటుంబానికి గవాస్కర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -
- Advertisement -