Friday, November 22, 2024

పల్లెలో అభివృద్దే ప్రగతికి చిహ్నాలు

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్

కంది: గ్రామాలాభివృద్ధే దేశాభివృద్ధికి నిదర్శనమని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. గురువారం పల్లె ప్రగతి దినోత్సవంలో కంది మండలంలోని చిమ్నాపూర్, ఎర్దనూర్‌లో 20లక్షల రుపాయలతో కొత్త పంచాయితీ భవన నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రత, స్వచ్ఛతే లక్షంగా దశలవారీగా పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. వైకుంఠదామాల నిర్మాణం, క్రీడ ప్రాంగణాలు, మొక్కల పెంపకం, డంపింగ్ యార్డులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. తెలంగాణలో పంచాయతీలు దేశానికే ఆదర్శంగా మారయన్నారు.

బ్యాతోల్‌లో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవంలో సర్పంచ్ శిరీషరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రబుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. గ్రామంలో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ నిర్మాణం ప్రజలకు మౌలిక వసతులు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలోఎంపిపి సరళపుల్లారెడ్డి, ఎర్దనూర్ సర్పంచ్ దుర్గయ్యగౌడ్, ఎంపిటిసి హన్మంత్‌నాయక్, జడ్‌పిటిసి కొండల్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మెన్ కృష్ణాగౌడ్, సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, నాయకులు రాజు చిమ్నాపూర్ సర్పంచ్‌లున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News