Monday, January 20, 2025

తెలంగాణ పల్లెలు అభివృద్ధికి ప్రతీకలు

- Advertisement -
- Advertisement -
  • దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు
  • గజ్వేల్ ఎఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్

గజ్వేల్ జోన్: ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రతి పల్లెను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వమని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని పలు గ్రామాలలో పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని అహ్మదీపూర్ గ్రామంలో సర్పంచ్ చాడ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎఎంసి ఛైర్మన్ మాట్లాడుతూ ప్రతి పల్లెలో సిసి రోడ్లు, యూజిడి డ్రైనేజీలు, నూతన ప్రభుత్వ భవనాలు, పల్లె ప్రకృతి వనాలు, అంగన్వాడీ కేంద్రాలు వైకుంఠధామాలు, రోడ్డు వంతెనలు, అంతర్గత రహదారులు, వీధి దీపాలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించటంతో పాటు సంక్షేమ పధకాలైన కళ్యాణ లక్ష్మి, శాదీముబారక్, రైతుబంధు,రైతు బీమా తదితర పధకాలను ఎలాంటి పైరవీలులేకుండా లబ్దిదారులకు చేరవేస్తున్న ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వమన్నారు.

అంతే కాకుండా ఆరోగ్య లక్ష్మి,ముఖ్యమంత్రి సహాయ నిధి,సంక్షేమ హాస్టళ్లు, ఓవర్సీస్ ఉపకార వేతనాలు,అందిస్తూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు, రైతు ఆరుగాలం పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా సిఎం కెసిఆర్ మెరుగైన మద్దతు ధర అందిస్తూ రైతుల ఆర్థిక అభివృద్దికి పరోక్షంగా పాటు పడుతున్నారన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం ఒక జీవన విధానంగా మార్చిన సిఎం కెసిఆర్ మార్గదర్శకాలతో ప్రతి గ్రామంలో నర్సరీలు, నాటిన మొక్కలను పరిరక్షించటం నిరంతర ప్రక్రియగా సాగే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. కెసిఆర్ రూపొందించిన పల్లె ప్రగతి అత్యంత విజయవంతమైన కార్యక్రమం అని ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని పల్లెలను దేశానికి ఆదర్శంగా నిలపాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సఫాయి కార్మికులను ఆయనతో పాటు సర్పంచ్ శ్రీనివాస రెడ్డిలు ఘనంగా సన్మానించి వారికి సర్టిఫికెట్లను అందచేశారు.

ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శులందిస్తున్న సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఆనందం, ఉప సర్పంచ్ చంద్ర కళ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరీమొద్దీన్, ఎపిఎం యాదగిరి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, బిఆర్‌ఎస్ నాయకులు రమేష్ గౌడ్, అహ్మద్, నిజామొద్దీన్, ప్రభాకర్, వార్డు సభ్యులు బుచ్చిరెడ్డి, నరేందర్ రెడ్డి, ఎల్లయ్య, నాంపల్లి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గురువారం మండలంలోని శ్రీగిరి పల్లిలో సర్పంచ్ చెరుకు చంద్ర మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని పల్లె పహాడ్, వేముల ఘాట్, లకా్ష్మపూర్ ,ఎర్రవల్లి తదితర గ్రామాలలో పల్లెప్రగతి దినోత్సవాలను జాతీయ పతాకాలను ఆవిష్కరించి ఘనంగా జరుపుకున్నారు. ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి ఉత్సాహంగా ఈ వేడుకలు జరుపుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News