Friday, November 22, 2024

అట్టడుగు వర్గాలకు వైద్య మౌలిక వసతులను విస్తరించిన సింక్రోనీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ప్రీమియర్‌ కన్స్యూమర్‌ ఫైనాన్షియల్‌ సేవల కంపెనీ సింక్రోనీ (ఎన్‌వైఎస్‌ఈ:ఎస్‌వైఎఫ్‌), భారతదేశంలో అట్టడుగు వర్గాల ప్రజలకు వైద్య మౌలిక సదుపాయాలు, న్యూట్రిషన్‌ను అందించేందుకు పలు కీలక కార్యక్రమాలను చేపట్టింది. తమ కార్పోరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో ప్రయత్నాలలో భాగంగా, సింక్రోనీ తమ మద్దతును ఢిల్లీలోని ఐజీ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌లోని ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్‌లలో మద్దతు అందించడంతో పాటుగా బెంగళూరులో న్యూట్రిషన్‌ కిట్‌ పంపిణీ డ్రైవ్‌ నిర్వహించింది.

ఈ కార్యక్రమాలను గురించి సింక్రోనీ చీఫ్‌ డైవర్శిటీ , ఇన్‌క్లూజన్‌ అండ్‌ కార్పోరేట్‌ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్‌ మైఖేల్‌ మాథ్యూస్‌ మాట్లాడుతూ ‘‘ వైద్య సంరక్షణ మరియు పౌష్టికాహారం అనేవి భారతదేశంలో అత్యంత ప్రాధాన్యతాంశాలుగా ఉన్నాయి. కొవిడ్‌ మహమ్మారి మరింతగా దేశంలో అత్యున్నత స్ధాయి ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల ఆవశ్యకతను పునరుద్ఘాటించింది. సమాజంలో సానుకూల మార్పులను తీసుకురావడంతో పాటుగా బీద వర్గాలకు మెరుగైన వసతులను అందించాలనే లక్ష్యంతో అవసరమైన హాస్పిటల్స్‌లో తగిన వైద్య సదుపాయాల కల్పనకు తగిన మద్దతు అందిస్తున్నాము. వైద్య మద్దతు మరియు పోషకాహారం అవసరమైన వారికి తగిన మద్దతును మా కార్యక్రమాలు అందించగలవని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికీ హెల్త్‌కేర్‌, న్యూట్రిషన్‌ను చేరువ చేయాలనే మా ప్రయాణంలో మాకు మద్దతుగా నిలిచిన యునైటెడ్‌ వేను ప్రశంసిస్తున్నాము’’ అని అన్నారు.

స్వతంత్య్ర లాభాపేక్షలేని సంస్థలు కావడంతో పాటుగా యునైటెడ్‌ వే వరల్డ్‌వైడ్‌కు అనుబంధంగా ఉన్న యునైటెడ్‌ వే ఢిల్లీ మరియు యునైటెడ్‌ వే హైదరాబాద్‌తో పాటుగా సోహమ్‌ అకాడమీతో భాగస్వామ్యం చేసుకున ఈ దిగువ కార్యక్రమాలకు తమ మద్దతు అందించింది.

1. ఐజీ హాస్పిటల్‌, ద్వారక, ఢిల్లీకు క్లిష్టమైన వైద్య మౌలిక సదుపాయాల మద్దతు

ఇందిరాగాంధీ హాస్పిటల్‌ (ఐజీహెచ్‌) ను 2020లో మహమ్మారి సమయంలో సేవలనందించేందుకు ఎంపిక చేసిన ఒకే ఒక్క పబ్లిక్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా ఢిల్లీలోని సబ్‌సిటీ ద్వారకలో ఎంపికైంది. ప్రారంభంలో ఈ హాస్పిటల్‌ ఉచితంగా నెలకు 300కు పైగా కొవిడ్‌ –19 రోగులకు ద్వితీయ వేవ్‌ సమయంలో సేవలనందించింది. నేడు, ఈ హాస్పిటల్‌లో 1500కు పైగా పడకల సౌలభ్యం ఉంటే,దాదాపు 3వేల మంది ఔట్‌పేషంట్లు సందర్శిస్తుంటారు. యునైటెడ్‌ వే ఆఫ్‌ ఢిల్లీ మద్దతుతో సింక్రోనీ, ఈ హాస్పిటల్‌కు వారు కోరుకున్న హై ఫ్రీక్వెన్సీ డిజిటల్‌ ఎక్స్‌ రే మెషీన్‌ మరియు ల్యాప్‌టాప్‌ ఆధారిత స్పైరోమెట్రీ యూనిట్‌ను ఛాతీ రోగులు (లేదా మరేదైనా పల్మనరీ సంబంధిత వ్యాధులు)కు ఎక్స్‌రేలు తీయడం కోసం కోరింది. గతంలో ఈ తరహా ఎక్స్‌రేలతో పాటుగా కొన్ని రకాల హెవీ రేడియో డయాగ్నోసిస్‌ కోసం బయటకు పంపేవారు. ఈ సదుపాయాలతో నెలకు 600 మందికి పైగా రోగులకు ప్రయోజనం చేకూరుతుంది.

ఈ కార్యక్రమ మద్దతుతో, నూతన ఎక్స్‌–రే ను ఏర్పాటుచేశారు. దీనిని ప్రత్యేకంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధి నిర్ధారణ కోసమే వినియోగిస్తున్నారు. దీనివల్ల ఇన్‌ఫెక్షన్‌ రేట్‌ తగ్గింది. ఈ గదిని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడంతో పాటుగా సింగిల్‌ డిపార్ట్‌మెంట్‌కు అంకితం చేశారు.

2. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్‌కు మద్దతు

ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్‌ను 1950లో ప్రారంభించారు. హైదరాబాద్‌ లో అతి పురాతన క్యాన్సర్‌ కేర్‌ కేంద్రాలలో ఒకటి కావడంతో పాటుగా చుట్టు పక్కల రాష్ట్రాలలో వేలాది మంది గ్రామీణ ప్రాంత రోగుల ఆరోగ్య సేవలను అందిస్తుంది. ఈ ప్రాంతీయ క్యాన్సర్‌ కేర్‌ కేంద్రం తెలంగాణా ప్రభుత్వ ఆధీనంలో పని చేయడంతో పాటుగా బీదవర్గాల ప్రజలకు మరియు ఆర్ధిక అవరోధాల కారణంగా మెరుగైన వైద్య సేవలు పొందలేని వారికి తోడ్పడుతుంది.

భారతదేశంలో క్యాన్సర్‌ కేసుల సంఖ్య ప్రతి సంవత్సరం 10% చొప్పున పెరుగుతున్నాయి. ఈ సదుపాయం అదనపు భారాన్ని మోయలేని స్ధితిలో ఉంది. విస్తృత శ్రేణి వైద్య కారణాల వల్ల ఏ సమయంలో అయినా 600–700 మంది రోగులకు హాస్పిటలైజేషన్‌ అవసరం పడుతుంది. వీరిలో శస్త్రచికిత్స చేయించుకున్న వారు, కీమోథెరఫీ, రేడియేషన్‌థెరఫీ, బోన్‌మారో మార్పిడి రోగులు కూడా ఉంటారు. మానవవనరులు, మెడికల్‌ కేర్‌, ఎక్విప్‌మెంట్‌, ఔషదాలు వంటివి ఎంఎన్‌జె వద్ద ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అయితే, కొన్ని సార్లు తగినన్ని బెడ్స్‌ లభించకపోవడం చేత చికిత్స ఆలస్యమవుతుంది. దీనికి , స్పందనగా సింక్రోనీ 23 పడకల ఐసీయు బెడ్‌ను నిర్మించడంలో సహాయపడటంతో పాటుగా ఒక ఎక్స్‌ రే యూనిట్‌ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చి రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌పై ఒత్తిడి తగ్గిస్తుంది. అంతేకాకుండా 14 పేషంట్‌ ట్రాలీలను రోగుల తరలింపు కోసం అందించింది. ఈ సహాయంతో, ఎంఎన్‌జె హాస్పిటల్‌ కనీసం 100కు పైగా రోగులకు తగిన సౌకర్యాలు అందిస్తుంది.

‘‘ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్‌ వద్ద పేషంట్‌ అడ్మిషన్‌ సామర్ధ్యం మెరుగుపరచాలనే సింక్రోనీ లక్ష్యానికి తగిన మద్దతు అందించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ కార్యక్రమంతో 30 పడకల ప్రత్యేక ఐసీయు సదుపాయాన్ని ఏర్పాటుచేయడంతో పాటుగా ప్రస్తుత రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌ను సైతం విస్తరించాము. కాన్సర్‌ చికిత్స సుదీర్ఘకాలం జరుగాల్సి రావడంతో పాటుగా విపరీతమైన ఖర్చుతో కూడుకున్నది కావడం చేత మధ్య తరగతి కుటుంబాలకు ఇది భారంగా ఉంటుంది. అల్పాదాయ కుటుంబాలనైతే ఇది దారిద్య్రంలోకి తోసేస్తుంది. ఎంఎన్‌జె హాస్పిటల్‌, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు అందిస్తున్న ఒకే ఒక్క హాస్పిటల్‌. ఇది అత్యంత నైపుణ్యంతో కూడిన చికిత్సను వీలైనంత తక్కువ ధరలో అందిస్తుంది. ఈ హాస్పిటల్‌కు తగిన మద్దతు అందించడాన్ని గౌరవంగా భావిస్తున్నాము’’ అని యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ సీఈఓ రేఖా శ్రీనివాసన్‌ అన్నారు.

3. బెంగళూరులోని థనిశాండ్ర మురికివాడలలో పోషకాహార కిట్‌ల పంపిణీ

యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ సహకారంతో సింక్రోనీ , పోషకాహార కిట్‌ పంపిణీ కార్యక్రమాన్ని బెంగళూరులోని థనిశాండ్ర వద్ద నిర్వహించింది. ఇక్కడ వలస కార్మికులు ఉంటుంటారు. ఈ వలస కుటుంబాలలోని పిల్లలు ఎక్కువ మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇది వారి శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రభావం చూపడం మాత్రమే కాదు, వారి విద్యా ప్రదర్శనపై కూడా ప్రభావం చూపడంతో పాటుగా ఎదుగుదుల కూడా ఆగిపోతుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పిల్లలకు న్యూట్రిషనల్‌ సప్లిమెంట్స్‌ను ఆహార పొట్లాల ద్వాకా అందించారు. దాదాపు 200 మంది నిరుపేద చిన్నారులు మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివాసముండే పిల్లలు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారు. కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్స్‌, ఫ్యాట్స్‌, మ్యాక్రో, మైక్రో న్యూట్రియంట్స్‌ సమతులంగా అందించడం వల్ల వారి రోగ నిరోధక శక్తి పెరగగలదని అంచనా.

సింక్రోనీ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మరియు బిజినెస్‌ లీడర్‌ ఆండీ పొన్నేరీ మాట్లాడుతూ ‘‘ మా వ్యాపారాలు ద్వారా జీవిత నాణ్యత మెరుగుపరచాలన్నది మా లక్ష్యం. మన చుట్టూ ఉన్న వారు మన జీవితాలపై సానుకూలంగా ప్రభావం చూపగలరని మా అంచనా. ఆరోగ్యం అందరికీ ప్రాధాన్యతాంశం. ఈ కార్యక్రమాలను చేపట్టడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎక్కడ అవసరమో అక్కడ మా మద్దతు అందిస్తున్నాము. ఐహెచ్‌జీ ద్వారక మరియు హైదరాబాద్‌లో ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్‌కు మద్దతు అందించడాన్ని గౌరవంగా భావిస్తున్నాము. తద్వారా ఆరోగ్య అవసరాలు మెరుగవుతాయి . ఈ కార్యక్రమాల అమలులో మాకు తగిన మద్దతు అందించిన యునైటెడ్‌ వేకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’ అని అన్నారు.

4. రోబోటిక్స్‌ ఎగ్జిబిషన్‌

ఫిబ్రవరి 28,2023 న జాతీయ సైన్స్‌ దినోత్సవం పురస్కరించుకుని వార్షిక రోబోటిక్స్‌ ఎగ్జిబిషన్‌ను తమ హైదరాబాద్‌ కార్యాలయంలో 250 మంది విద్యార్థులతో నిర్వహించింది.

సోహమ్‌ అకాడమీ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌తో కలిసి సింక్రోనీ, 2021లో రోబోటిక్స్‌లో అడకమిక్స్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించింది. ఇది వినూత్నమైన రోబోటిక్స్‌ శిక్షణ కార్యక్రమంగా నిలువడంతో పాటుగా అత్యాధునిక, అత్యున్నత సాంకేతికతలను విద్యార్ధుల ఇంటి ముంగిట అందించడంతో పాటుగా సాంకేతికంగా అత్యాధునిక ప్రపంచానికి సిద్ధమయ్యేలా చేస్తుంది. హైదరాబాద్‌ చుట్టు పక్కల ప్రభుత్వ, ఎయిడెడ్‌ మరియు బడ్జెట్‌ పాఠశాలల్లో రోబోటిక్స్‌ వర్క్‌షాప్‌లను నిర్వహించింది. వీటికి అసాధారణ స్పందన పాఠశాలలు, విద్యార్ధుల నుంచి ఒకేలా లభించాయి.

ప్రతి సంవత్సరం, ఈ అకాడమీ రోబోటిక్స్‌ ఛాలెంజ్‌ను నిర్వహించడంతో పాటుగా వాస్తవ జీవితపు సమస్యలను పరిష్కరించడాన్ని శిక్షణ పొందిన విద్యార్థులకు అందిస్తుంది. ఇది విద్యార్థులు ఆవిష్కరించడంలో స్ఫూర్తి కలిగిస్తుంది. తద్వారా అత్యద్భుతమైన ప్రోటోటైప్స్‌, ఫ్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్స్‌ మరియు వర్కింగ్‌ మోడల్స్‌ను రూపొందించగలుగుతుంది. వీటిని రోబోటిక్స్‌ ఎగ్జిబిషన్‌ వద్ద ప్రదర్శించారు.

‘‘విద్యా కార్యక్రమాలలో మా రోబోటిక్స్‌కు వెన్నుముకగా సింక్రోనీ సేవలనందిస్తుంది. ఈ ఎగ్జిబిషన్‌కు సోల్‌ స్పాన్సర్‌గా ఇది నిలుస్తుంది. మా రోబోటిక్స్‌ కార్యక్రమాన్ని గత రెండు సంవత్సరాలుగా తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు తీసుకువెళ్లడంలో మద్దతు అందించిన సింక్రోనీ కి ధన్యవాదములు తెలుపుతున్నాను. ఈ రోబొటిక్స్‌ ప్రదర్శన ఆ ప్రయత్నాలన్నింటికీ ముగింపు’’ అని ఫౌండర్‌–డైరెక్టర్‌ శ్రీ సహదేవ్‌ కొమరగిరి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News