హైదరాబాద్: చందనవెల్లిలో సింటెక్స్ ప్లాంట్ ఏర్పాటు సంతోషకరమైన విషయమని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. వెల్‌స్పన్ కంపెనీని తీసుకొచ్చిన మంత్రి కెటిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో వెల్‌స్పన్ ప్లాంట్‌కు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. రూ.350 కోట్ల పెట్టుబడులతో సింటెక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేశారు. వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు సమాచారం.
ఈ సంస్థ నీళ్ల ట్యాంకులు, పైపులను ఉత్పత్తి చేయనుంది. తెలంగాణ ప్రభుత్వంతో వెల్‌స్పన్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ఏం వస్తుందన్న వాళ్లకు ఇక్కడి పరిశ్రమలే సమాధానం చెబుతాయని ఎంఎల్‌ఎ కాలే యాదయ్య తెలిపారు. మరో 20 ఏళ్లు సిఎం కెసిఆర్ పాలన ఉండాలని కాలే ఆశాభావం వ్యక్తం చేశారు. షాబాద్ గతంలో ఎలా ఉంది ఇప్పుడెలా ఉందో గమనించాలని ఎంపి రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. షాబాద్ ప్రాంతానికి వరల్డ్ క్లాస్ ఫెసిలిటిస్ వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, ఎంఎల్‌ఎ కాలే యాదయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.