Monday, January 13, 2025

సిరియాలో పెట్రేగిపోతున్న తిరుగుబాటుదారులు

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్ష తిరుగుబాటుదారులు శనివారం సిరియాలోని దారాపై నియంత్రణ సాధించారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ కు వ్యతిరేకంగా పురోగతిని సాధించారు. కొన్ని రోజులలోనే మిలిటెంట్ ల చేతికి చిక్కిన నాలుగో నగరం దారా. దీంతో బషర్ అల్-అస్సాద్ కు వ్యతిరేకంగా ముప్పు పెరిగింది. తాజా దాడుల్లో 200 మందికిపైగా చనిపోయారు,  280000 మంది నిరాశ్రయులయ్యారు. సిరియా ప్రతిపక్ష తిరుగుబాటుదారులు రాజధాని డామస్కస్ కు చేరువవుతూ వస్తున్నారు. మహిళలు,  యువతుల పరిస్థితి అయితే ఘోరంగా  తయారవుతోంది.

ఇదిలావుండగా అస్సాద్ ప్రభుత్వం యూఏఈ, ఈజిప్ట్, జోర్డాన్, ఇరాక్ నుంచి ఆయుధాలు,  ఇంటెలిజెన్స్ సాయాన్ని కోరింది. ముఖ్యమైన కేంద్రాలు తిరుగుబాటుదారుల వశమైపోతుండడంతో అస్సాద్ ప్రభుత్వం ఈ సాయాన్ని కోరింది. కాగా వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం కొంత మంది అరబ్ అధికారులు అస్సాద్ ను దేశం విడిచి వెళ్లాలని కోరారు. ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని సిరియన్ తిరుగుబాటుదారులు పురోగమిస్తున్నారు.  వారిప్పటికే కీలక నగరాలైన అలెప్పో, హమా, దీర్ ఎజ్జార్ సహా ఉత్తర, మధ్య సిరియాలోని ప్రాంతాలను కైవసం చేసుకున్నారు.

Assad

Syria

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News