Sunday, December 22, 2024

టి-24 టికెట్ ధరల్ని పెంచిన ఆర్‌టిసి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో తక్కువ ధరలో 24 గంటల పాటు ప్రయాణించడానికి టి -24 టికెట్ ఎంతో ఉపయోగపడుతుంది. టి-24 టికెట్ ప్రస్తుత ధరల్ని పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి టికెట్ తీసుకున్నామంటే 24 గంటల పాటు నగరంలో ఎక్కడైనా తిరిగే వెసు లుబాటు ఉంటుంది. వంద రూపాయల లోపే ఉన్న ఈ టికెట్ ధరలు సామాన్యులకు ఎంతో ఊరటగా కలిగించాయి. అయితే హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటలపాటు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించే టి-24 టికెట్ ప్రస్తుత ధరల్ని పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్ ధరను 90 రూపాయల నుంచి వందకు పెంచినట్లు అధికారులు తెలిపారు.సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్ ధరను రూ.90 నుంచి రూ.100కి పెంచింది. సీనియర్ సిటిజన్ల(పురుషులు, మహిళలు, 12 ఏళ్లపైబడిన బాలికలు)కు రూ.80 ఉండగా రూ.90 చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టి -24 టికెట్ ధరలు జూన్ 16 నుంచి జులై 31 వరకు అమల్లో ఉంటాయని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో సాధారణ ప్రయాణికులకు టీ-24 టికెట్ ధర రూ.100 ఉండగా. ఏప్రిల్ 26న రూ.90కి తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు రూ.80కి అందించింది. తాజాగా పాత ధరల్ని తీసేసి కొత్త ధరల్ని తీసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News