అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా మత్సశాఖ అధికారి షకీలా భాను అధ్యక్షతన మత్స పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ , డైరెక్టర్ల ఎన్నిక ప్రకటనను జూన్ 23వ తేదీన పూర్తి చేశారు. ఈ ఎన్నికలో తుది ఫలితం ప్రకారం శుక్రవారం జిల్లా మత్స శాఖ కార్యాలయం వల్లూరు కు చెందిన టి. గోపాల్‌ని గద్వాల జిల్లా మత్స పారిశ్రామిక సహకార సంఘం జిల్లా చైర్మన్‌గా పది మందిని డైరెక్టర్లుగా నియామకం చేయడం జరిగింది.
మత్స పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా ముగ్గరు సభ్యులు పోటీపడగా అందులో గోపాల్‌కు ఎక్కువ ఓట్లు రావడంతో కలెక్టర్ అనుమతితో తుది ఫలితం ప్రకటించడం జరిగింది. జిల్లా చైర్మన్‌గా టీ. గోపాల్ , డైరెక్టర్లుగా గుర్రం గడ్డ సంజీవులు, జె. చెన్నయ్య, సుధాకర్, మద్దిలేటి, గంగాధర్, తిమ్మప్ప, రాముడు, రంగన్న, లక్ష్మన్న, మద్దిలేటి, చిన్న రంగన్న, మొదలగు వారితో కమిటీని ఏర్పాటు చేయడమైందన్నారు.
ఈ ఎన్నిక మత్సశాఖను బలోపేతం చేయడంలో ఎంతో కీలకంగా ఉంటుందని రానున్న రోజుల్లో చైర్మన్ గోపాల్ సహకారంతో మత్సశాఖను మరింత బలోపేతం చేసి ప్రతి ఒక్క మత్సకారునికి తగు విధంగా ప్రభుత్వ పథకాలు అందేలాగా కృషి చేస్తానని తెలిపారు. మత్స పారిశ్రామిక సహకార చైర్మన్‌గా నియామకం చేసినందుకు మత్సకార సోసైటీల అధ్యక్షులు అందరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు.