రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టి మధ్యలోనే వెళ్లిపోయిన జానా
భట్టిపై రేణుక ఆగ్రహం, గుణపాఠం నేర్చుకోవాలన్న విహెచ్
రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టి మధ్యలోనే వెళ్లిపోయిన జానారెడ్డి
భట్టిపై రేణుక ఆగ్రహం, ఓటములపై గుణపాఠం నేర్చుకోవాలి: విహెచ్
బిజెపితో పొత్తు ఎన్నటికీ జరగదు: మధుయాష్కీ, 2023 వరకు మాట్లాడను : జగ్గారెడ్డి
కాంగ్రెస్ ఓటమిపై నివేదిక ఇవ్వాలి: మాణికం ఠాగూర్, వాడీవేడిగా పిఎసి సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం సాగింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమికి సంబం ధించిన అంశంపైనే ప్రధానంగా చర్చ సాగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి 3 వేల ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి 3వేల ఓట్లు దక్కడంపై ఆ పార్టీ నేతలు షాక్‌కు గురయ్యారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవ హారాల కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో హు జూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమిపైనే ప్రధానంగా చర్చ సాగింది. టిపిసిసి చీఫ్ రేవంత్‌ను టార్గెట్ చేస్తూ మంగళవారం జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి నేతలు సీరియస్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీనియర్లకు స్వేచ్ఛ ఎక్కువని, వారిని కలుపుకొని పోతానని రేవంత్ సమాధానమిచ్చిన సంగతి విధితమే.
ఈ నేపథ్యంలో బుధవారం రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కూడా కొందరు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి లక్షంగా చురకలంటించే ప్రయత్నం చేశారని సమాచారం. ఈ నేపథ్యం లో పార్టీ ఓటమికి నీవొక్కడిదే బాధ్యత ఎలా అవుతుంది? అని జానారెడ్డి రేవం త్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇదంతా సమష్టి బాధ్యత అని ఆయన చెప్పారు. ఇదే స మయంలో కొందరు నేతలు మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా జానారెడ్డి సీరియస్ అయ్యారు. తాను మాట్లాడే సమయంలో ఎవరూ అడ్డు రావొద్దన్నా రు. తనను మాట్లాడకుండా అడ్డుకుంటే తాను సంతకం పెట్టి వెళ్లిపోతానని జానారెడ్డి చెప్పారు. దీంతో జానారెడ్డి మాట్లాడేవరకు పార్టీ నేతలు అడ్డు చెప్ప లేదు. అయితే జానారెడ్డి వ్యాఖ్యలకు మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి సమ ర్థించారు. పార్టీ ఓటమికి సమష్టి బాధ్యత తీసుకోవాలని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావు, మాజీ ఎంపి మధుయాష్కీలు హుజూరాబాద్ ఉప ఎన్నిక ల గురించి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రె స్ పార్టీ ప్లాప్ షోగా విమర్శలు గుప్పించారు.
స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. స్టార్ క్యాంపెయినర్లు ఎక్కడెక్కడ ప్రచారం చేశారని కాం గ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. శతృవుకి శత్రువు మిత్రుడు.. అందుకే ఈటల రాజేందర్‌కు మద్దతిచ్చామన్నారు. ఈ పరిణామాలపై పార్టీ అధినాయకత్వానికి నివేదిక ఇస్తానని ప్రకటించిన ఆయన బుధవారం జరిగిన రాజకీయ వ్యవహరాల కమిటీ సమావేశానికి డుమ్మాకొట్టారు.
నా అవసరం ఉన్నప్పుడే వస్తా..
కాగా పిఎసి సమావేశానికి హాజరైన సీనియర్ నేత జానారెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. నల్గొండలో స్నేహితుడి అంత్యక్రియలకు వెళుతున్న ట్లు ఆయన చెప్పారు. ‘ప్రతిసారి సమావేశానికి రాను.. అవసరం వున్నప్పు డే వస్తా’ నంటూ వెళ్లిపోయారు.
భట్టిపై రేణుక ఆగ్రహం
సిఎల్పీనేత భట్టిపై రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఖ మ్మం జిల్లాలో భట్టి చర్యలతో సమస్యలు వస్తున్నాయని రేణుకాచౌదరి ప్రస్తా వించారు. రేణుక వ్యాఖ్యలతో విభేదిస్తూ తాను సిఎల్పీ నాయకుడని అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సిఎల్పీ నేత అయితే సమస్యలు పరిష్కరించాలే కానీ సృష్టించవద్దని రేణుక చౌదరి వ్యాఖ్యానించారు. మీరు భాగస్వామ్యం అయితే పరిస్థితులు మెరుగుపడాలని సూచించారు. రేణుక చౌదరి వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క మౌనం దాల్చినట్లు తెలుస్తోంది.
సమీక్ష లేకనే ఈ పరిస్థితి
గతంలో జరిగిన ఎన్నికలపై సమీక్ష జరగలేదని సీనియర్ నేత వి.హనుమంత రావు తప్పుబట్టారు. ఓటములపై సమీక్ష లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందన్న విహెచ్.. ఓటములపై గుణపాఠం నేర్చుకోవాలని చురకలం టించారు. విహెచ్ ప్రశ్నలకు నేతలంతా నేతలు మిన్నకుండిపోయారు. దామో దర రాజనర్సింహా సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.
అందరికీ శత్రువయ్యా..
2023 ఎన్నికల వరకు పార్టీ అంతర్గత వ్యవహారాలపై తాను మాట్లాడబోనని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఉన్నది ఉన్నట్లు చెబితే అందరికీ శత్రువు అవుతున్నానని అభిప్రాయపడ్డారు. హుజూ రాబాద్ ఉప ఎన్నికలో క్షేత్రస్థాయి పరిస్థితి గురించి బోసురాజు, మాణికం ఠాగూర్‌కు ఏం తెలుసునని ప్రశ్నించారు. పార్టీ సమావేశంలోనూ, మీడియా లోనూ ఉన్నది ఉన్నట్లు చెప్తే అందరికీ శత్రువు అవుతున్నానని అభిప్రాయపడ్డా రు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో క్షేత్రస్థాయి పరిస్థితి గురించి బోస్‌రాజు, మాణికం ఠాగూర్‌కు ఏం తెలుసుననిప్రశ్నించారు. పార్టీ సమావేశంలోనూ, మీడియాలోనూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఇబ్బంది కలుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కొన్ని విషయాల పై తాను మాట్లాడతానని చెప్పారు. అయితే తాను ఏం మాట్లాడుతానో మాత్రం ఇప్పుడే చెప్పబోనన్నారు. పార్టీ అంతర్గత విషయాలకు సంబంధించి తాను పార్టీ నేతలతో చర్చిస్తానన్నారు. భవిష్యత్తులో ఈ విషయాలపై తాను చర్చించబోనని హామీ ఇచ్చారు.
జగ్గారెడ్డిని చూసి ఓట్లేస్తారా?
మీడియాలో ఓ సెక్షన్ తనకు వ్యతిరేకంగా ఉన్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక్క ఉప ఎన్నికతోనే ఏమౌతుందని ఓ సెక్షన్ మీడియా తనను ప్రశ్నిస్తోందన్నారు. వచ్చే ఎన్నికలలో తన సీటు ఎలా గెలిపించుకోవాలనే దానిపైనే శ్రద్ధ పెడుతానన్నారు. రానున్న రోజుల్లో తాను సంగారెడ్డిలో గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు. పార్టీ వ్యవహారాలపై మాట్లాడినందుకు తనకు షోకాజ్ నోటీసు ఇస్తారో.. లేదో వాళ్లిష్టమని, ఈ విషయం తనకు తెలియదని చెప్పారు. హజూరాబాద్ ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు వెళ్తేనే ఓట్లు పడలేదు. గ్గారెడ్డిని చూసి ఓట్లు వేస్తారా? అని ఆయన సెటైర్లు విసిరారు.
పార్టీలో క్రమశిక్షణ లోపం
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమిపై నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ ఆదేశించారు. ఈ ఓటమిపై నివేదిక ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలపై రాజకీయ వ్యవహారాల కమి టీలోనే చర్చించాలని పార్టీ నేతలకు మాణికం ఠాగూర్ ఆదేశించారు. రాజకీ య వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించకపోతే రాహుల్, సోనియా గాంధీతో చర్చించాలని పార్టీలో క్రమశిక్షణ లోపం ఉందని అభిప్రాయపడ్డారు. నేతలతో సమిష్టిగా వ్యవహరించాలని సూచించారు.
భవిష్యత్ కార్యక్రమాలు, పార్టీ పటిష్టతపై
కాగా, ఈ సమావేశంలో ప్రధానంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపైన సుదీర్ఘ చర్చ సాగగా, రాష్ట్రంలో చేపడుతున్న సభ్యత్వ నమోదు, సభ్యులకు ప్రమాద బీమా, నవంబర్ 14 నుంచి 15 రోజుల పాటు చేపడుతున్న ప్రజా చైతన్య పాదయాత్ర, విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్, పార్టీ భవిష్యత్ కార్యక్ర మాలు, పార్టీ పటిష్టత తదితర అంశాలపై చర్చించారు. గాంధీభవన్‌లో ఎఐసిసి ఇంఛార్జి మాణికం ఠాగూర్ అధ్యక్షతన టిపిసిసి రాజకీయ వ్యవహ రాల కమిటీ సమావేశం కొనసాగింది. సమావేశంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, ఎఐసిసి ఇంఛార్జి కార్యదర్శి బోసురాజు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్స్ గీతారెడ్డి, మహేష్ కుమార్‌గౌడ్, అజారుద్దీన్, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజ నర్సింహా, ఎఐసిసి కార్యక్రమాల చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, ఎఐసిసి కార్యదర్శులు సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి, ఎంఎల్‌ఎ శ్రీధర్‌బాబు, మాజీ కేంద్ర మంత్రులు రేణుకాచౌదరి, బలరాం నాయక్, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.