వెల్లడించిన ఎస్‌ఇఒ
మన తెలంగాణ / హైదరాబాద్ : టి హబ్ రాష్ట్రంలో 12 వేల ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా రూ . 1800 కోట్ల నిధులను కూడా సేకరించినట్లు ఎస్‌ఇవో (తెలంగాణ సామాజిక అభివృద్ది ముఖ చిత్రం ) తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో ఇన్నోవేషన్, ఎకో సిస్టమ్‌ను ప్రారంభించేందుకు, సాధికారత కల్పించి స్టార్టప్‌లు, కార్పోరేషన్ ,ఇతర వాటాలను ప్రభావితం చేసేందుకు 2015 లో టి హబ్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్లాగ్‌షిప్ ఇన్నోవేషన్ ప్రొగ్రామ్, ల్యాబ్ 32, రాష్ట్రవ్యాప్తంగా 240 స్టార్టప్‌లను సాధికారతి కల్పిచడం ద్వారా 8వ కోహర్ట్‌ను పూర్తిచేసినట్లు తెలిపింది.
తెలంగాణ ఇన్నోవేషన్ పాలసి కింద తెలంగాణ స్టార్టప్‌లకు ప్రోత్సహకాలను అందించేందుకు టిఎస్‌ఐఐసి, ఇతర పర్యావరణ వ్యవస్థలతో కలిసి పనిచేయడంలో టి హబ్ ముందు ఉన్నట్లు తెలిపింది. టి హాబ్ ప్రారంభమైప్పటి నుంచి 2500 స్టార్టప్‌లపై ప్రభావం చూపడమే కాకుండా 1000కి పైగా ఈ వెంట్‌లను నిర్వహించినట్లు పేర్కొంది. అర్హత కలిగన స్టార్టప్‌లకు రూ.5 కోట్లు పంపిణీ చేసేందుకు పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం ( డిపిఐఐటి ), జిఓఐ ప్రమోషన్ కోసం డిపార్ట్‌మెంట్ ద్వారా స్టార్టప్ ఇండియా సీడ్ పథకం కింద టి హబ్ ఎంపిక కావడమే కాకుండా రాష్ట్రంలో స్టార్టప్ ఎకొసిస్టమ్ వృద్దికి సహకరించినందుకు గాను డిసిఐఐటి, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నేషనల్ స్టార్టప్ అవార్డ్ 2022లో “బెస్ట్ ఇంక్యుబేటర్ ”ఇన్ ఇండియా అవార్డును టి హైబ్ కైవసం చేసుకున్నట్లు తన నివేదికలో పేర్కొంది.
టి హబ్ ( టి హబ్ 2.0) రెండో దశ గత సంవత్సరం జూన్ 22 ప్రారంభించబడిందని, ఇది 4000 స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌లోని ఇతర కీలక అంశాలు కలిగి ఉండే సామర్థం ఉన్న ప్రపచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌లో ఒకటిగా పేర్కొంది. టి హబ్ 2వ దశలో రాష్ట్రంలోని స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచిందని తెలిపింది. జినొటి, మైగేట్, విజిల్‌డ్రైవ్ ,అవుట్‌ప్లే డ్రింక్‌ప్రైమ్, యాడ్‌నోమో వంటి స్టార్టప్‌లు మే 2022 నాటికి రూ. 2269 కోట్లకు పైగా నిధులు పొందినట్లు తన ఎస్‌ఇవో ( తెలంగాణ సామాజిక ఆర్దిక ముఖ చిత్రం ) నివేదికలో పేర్కొంది.