- Advertisement -
టిహబ్‌కు అత్యుత్తమ అవార్డు
ట్విట్టర్లోఅభినందనలు తెలిపిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: టిహబ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. దేశంలోనే అత్యుత్తమమైన నేషనల్ టెక్నాలజీ అవార్డు-2023ని టిహబ్ సొంతం చేసుకున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టిహబ్ సిఇఒ శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. టి-హబ్ నేషనల్ టెక్నాలజీ అవార్డు-2023ని సొంతం చేసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని, అవార్డు గెలుచుకున్న టి-హబ్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. టి-హబ్ దేశంలో అత్యుత్తమ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా గుర్తింపు పొందిందని మంత్రి కెటిఆర్ తెలిపారు.
- Advertisement -