Thursday, January 23, 2025

‘అంకురా’బాద్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: టి..హబ్ ద్వారా ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి రెపరెపలాడుతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ప్రపంచంలో యువ భారత్ సామర్థ్యాన్ని తె లపాలన్న లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన టిహబ్ కు మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రస్తుతం ఇది జాతీ య స్థాయిలోనే ఒక రోల్ మోడల్ నిలిచిందన్నారు. కేవలం రాష్ట్రానికే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థకు (స్టార్టప్స్) ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. అంకురాల ద్వారా అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రధానంగా ఆటోమొటివ్, అగ్రి రంగాల్లో సాంకేతికత గణనీమైన అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాదును సిలికాన్ వ్యాలీ లాగా తయారు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్షమన్నారు. రాయదుర్గంలోని టిహబ్ ఫౌండేషన్ ఏడవ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రండి. ఆవిష్కరణలతో వె ళ్లండి’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టి..-హబ్ 1,2 ద్వారా ప్రపంచస్థాయి సంస్థను సృష్టించామన్నారు.

ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన కొది ్దరోజులకే ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. ప్రగతిశీల స్టార్టప్ విధానం ద్వారా కార్పోరేట్లు విద్యాసంస్థల మధ్య ఫలవంతమైన భాగస్వామ్యం ఏర్పడిందన్నారు. టిహబ్ ఏర్పా టు ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్లకు అవసరమైన విహబ్, టి వర్క్, టాస్క్ రిచ్, వంటి సోదర సంస్థల ఏర్పాటుకు బాట లు పడ్డాయని వివరించారు. దీంతో హైదరాబాదులో అద్భుతమైన ఎకో స్టాటస్ సిస్టం డెవలప్‌మెంట్ అయిందని కెటిఆర్ వివరించారు. ప్రస్తుతం హైదరాబాదులో 8000 పైగా స్టార్టప్స్ ఉన్నాయన్నారు. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చూసి అనేక రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు. అందువల్లే వివి ధ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు టిహబ్ పరిశీలనకు వస్తున్నారన్నారు. చివరకు గోవా లాంటి రాష్ట్రాలు ప్రస్తు తం టిహబ్ ను చూసి వారి రాష్ట్రంలో కూడా ఇలాంటి హ బ్బులు ఏర్పాటు చేసుకుంటున్నాయన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలు టి..హబ్ తో ఒప్పందం చేసుకున్నాయని కెటిఆర్ పేర్కొన్నారు.

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న ఐఎఎస్‌లకు సంబంధించి ఒక వర్క్ షాప్ కూ డా ఇక్కడ జరిగిందన్నరు. టిహబ్‌లో ఉన్న స్టార్టప్స్‌కు అద్భుతమైన భవిష్యత్తు ఉందన్నారు. ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో టి. హబ్ నిర్మాణం జరిగిందని కెటిఆర్ వెల్లడించారు. యువ పారిశ్రామికవేతల తయారు చేయడమే ముఖ్య ఉద్దేశమన్నారు. టి..హబ్ లో ఉన్న స్టార్టప్‌కి మొదటి కస్టమర్ రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. టి -హబ్ తొలిదశ ద్వారా 2 వేలకుపైగా స్టార్టప్లకు ఊతమివ్వడంతోపాటు 1.19 బిలియన్ డాలర్ల నిధులు సమకూరాయని కెటిఆర్ తెలిపారు. వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజిల్ ఇన్వెస్టర్లతో స్టార్టప్లను అనుసంధానం చేయడంలో టి..-హబ్ ఎనలేని పాత్ర పోషించిందన్నారు. ఇక టి…హబ్ రెండవ దశను పూర్తి చేయడం వల్ల ప్రపంచంలోనే పది అగ్రశ్రేణి స్టార్టప్ వాతావరణం కలిగిన ప్రాంతాల జాబితాలో తెలంగాణ కూడా ఒకటిగా నిలిచిందన్నారు.టి..హబ్ లో పనిచేస్తున్న వారందరికి తన అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఫౌండేషన్ డేలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నానని కెటిఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టి..హబ్ సిఇఒ శ్రీనివాస్, పలు ఐటి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News