Monday, December 23, 2024

దేశానికే ఆదర్శం టి-హబ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: డల్లాస్ వెంచర్ క్యాపిటల్‌తో టి-హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కారణంగా ఇండియా ఫండ్ పేరుతో టి-హబ్  డల్లాస్ వెంచర్ క్యాపిటల్ డబ్బులు ఇవ్వనుంది. శుక్రవారం టి-హబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మం త్రి కె. తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన టి-హబ్ ప్రస్తుతం దే శానికే ఆదర్శంగా మారిందన్నారు. కొత్త అంకుర సంస్థలకు టి-హబ్ పుట్టినిల్లుగా మారిందన్నా రు. అద్భుతమైన పనితీరుతో టిహబ్ కొత్త పుంత లు తొక్కుతోందన్నారు. అలాంటి సంస్థతో డల్లాస్ వెంచర్ ఒప్పందం చేసుకున్నందుకు ఈ సందర్భంగా కెటిఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపా రు. డల్లాస్ వెంచర్ సంస్థ భారత్‌లో అనేక స్టార్టప్‌లను కూడా నెలకొల్పిందిన్నారు. దీని వల్ల భారత్ ఆర్థికంగా శరవేగంగా వృద్ధి చెందుతుందన్నారు.

ఫలితంగా దేశానికి పెట్టుబడులు రాబట్టడం పెద్దగా కష్టం కాదన్నారు. మంచి ఆలోచన ఉన్న స్టా ర్టప్లకు నిధులు అసలే ఇబ్బంది కాదన్నారు. అ యితే స్టార్టప్‌లను ఎలా నిర్వహిస్తాంచాలి? డబ్బు వృథా కాకుండా వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేస్తారన్నదే ముఖ్యమైన అంశమన్నారు. ప్రస్తుతం దేశంలోని అనేక రంగాల్లో స్టార్టప్‌లు వస్తున్నాయన్నారు. ఇది మంచి సంకేతానికి నిదర్శనమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కాగా భారతదేశంలో మొ ట్టమొదటి ప్రైవేటు రాకెట్ టి-హబ్ నుంచే వచ్చిందని కెటిఆర్ గుర్తు చేశారు. ‘ధ్రువ స్పేస్’ సంస్థ ఇటీవల నానో రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించిందన్నారు. ఇది రాష్ట్రం సాధించిన ప్రగతికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. అనేక స్టార్టప్‌లతో భారత్‌లో 25వేల ఉద్యోగాలు ఇవ్వాలని డల్లాస్

సంస్థ చేసిన ఆలోచన చాలా గొప్పదని ఈ సందర్భంగా కెటిఆర్ కొనియాడారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సుమారు 6 వేల వరకు స్టారప్లు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ స్టార్టప్‌లో భవిష్యత్‌లో మరిని విజయం తెలంగాణ రాష్టం అందుకుంటుందన్న విశ్వాసాన్ని కెటిఆర్ వ్యక్తం చేశారు. స్టార్టప్‌లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్న కారణంగా ఐటి రంగంలో తెలంగామ కొత్త ఒరవడిని సృష్టిస్తోందన్నారు. ఇలాంటి శాఖకు తాను మంత్రిగా కొనసాగుతుండడం ఒక రకంగా గర్వంగా కూడా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన 2014లో తెలంగాణలో అనేక రంగాల్లో ప్రతికూల పరిస్థితులు విలయతాండవం చేస్తుండేవన్నారు. కాని సిఎం కెసిఆర్ విజన్, తీసుకున్న కీలక నిర్ణయాలు, పాలనలో తీసుకున్న సంస్కరణలతో కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలబడిందన్నారు. పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దేశంలోనే తెలంగాణ రోల్‌మోడల్‌గా కొనసాగుతోందని కెటిఆర్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో భారత్‌లో అడుగుపెట్టే ప్రతి సంస్థ ముందుగా తెలంగాణ రాష్ట్రాన్నే ఎంచుకుంటుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News