Thursday, January 16, 2025

ఛత్తీస్ డిప్యూటీ సిఎంగా సింగ్‌దేవ్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రిగా టిఎస్ సింఘ్‌దేవ్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు రాజకీయ ప్రత్యర్థిగా సింగ్‌దేవ్‌కు పేరుంది. ఈ ఏడాది చివరిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దశలో సింగ్‌దేవ్‌కు డిప్యూటీ బాధ్యత అప్పగించారు. ఇప్పటివరకూ బఘేల్‌ను సిఎం పదవి నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి.

అయితే కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం తరువాత సింగ్‌దేవ్‌కు డిప్యూటి సిఎం పదవిని ఇస్తున్నట్లు ప్రకటించారు. బఘేల్, సింగ్‌దేవ్ మధ్య ఇది రాజీ ఫార్మూలాగా భావిస్తున్నారు. టిఎస్ సింగ్‌దేవ్‌కు ఉపముఖ్యమంత్ర పదవి ప్రతిపాదనకు పార్టీ అధ్యక్షులు ఖర్గే సమ్మతించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కెసివేణుగోపాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News