Saturday, December 21, 2024

ఆగస్టు 23 నుంచి టి టిడిపి బస్సు యాత్ర

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి : ఆగస్టు 23 నుంచి టి టిడిపి బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రకటించారు. ఈ బస్సు యాత్రలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని అన్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగతుందని.. ఇక్కడ చంద్రబాబు సైతం పాల్గొంటారని, ఈ మేరకు ఆహ్వానిస్తామని కాసాని స్పష్టం చేశారు. హైదరాబాద్ తర్వాత జిల్లాల్లో బస్సు యాత్రను కొనసాగిస్తామన్నారు. పార్టీ శ్రేణులంతా బస్సు యాత్రను విజయవంతం అయ్యేలా చూడాలని కాసాని జ్ఞానేశ్వర్ పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో తెదేపా 119 స్థానాల్లో పోటీ చేస్తుందని..మహిళలకు యువతకు పెద్ద పీట వేస్తామని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రకటించారు . ఈ మేరకు ఆదివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం బాచుపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది.

మల్కాజగిరి పార్లమెంట్ అధ్యక్షుడిగా అశోక్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షునికి, ఆ కమిటీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా ఏమి చేస్తుంది..ఏమి చెయ్యాలో ఏమి చేసిందో..రేపటి బస్సుయాత్ర వివరిస్తామన్నారు.దానితో పాటు తెలుగుదేశం అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 119 నియోజక వర్గాల్లో నిలబడుతూ.. తమ సత్తా చూపిస్తామని తెలిపారు. తెలంగాణలో తమ పార్టీ టీడీపి లేదంటున్న పార్టీలకు తమ సత్తా చూపిస్తామన్నారు. కాంగ్రెస్ , బిజేపి తదితర పార్టీలు తమను చూసి బయపడుతున్నాయని పేర్కొన్నారు. ఖమ్మం సభ ద్వారానే టీడీపి ఏంటో చూపిందన్నారు. పార్టీ ఎక్కడ ఉందో తెలపడానికి.. ఎక్కడైనా సభను పెట్టి తమ మా సత్తా ఏంటో చూపించాలా అని ఘాటుగా వాఖ్యలు చేశారు.

సోషల్ మీడియాలో కౌంటర్ ఇద్దాం … రావుల చంద్రశేఖర్ రెడ్డి
తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ టిడిపి పార్టీ గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే..సోషల్ మీడియాలో వాటిపై కౌంటర్ ఇవ్వాలని పార్టీ నేతలకు సూచించారు. జాతీయ అధికార ప్రతినిధి తిరుమలగిరి జ్యోత్స్న మాట్లాడుతూ..పేదల కోసం గాంధీ హాస్పిటల్ నుండి సేవలందించింది టిడిపియేనన్నారు. గీతం, నల్సార్, ఉర్దూ యూనివర్సిటీ లను ఏర్పాటు చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జాతీయ కార్యదర్శి కాసాని విరేష్, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సామ భూపాల్ రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన,ప్రధాన కార్యదర్శులు ,జక్కిలి ఐలయ్య యాదవ్,అజ్మీరా రాజు నాయక్, జివిజి నాయుడు,ఆరిఫ్, వెంకటేశ్వర్లు ,అధికార ప్రతినిధులు, సూర్యదేవర లత, ఏ.ఎస్ రావు.. రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శులు, మందూరి సాంభ శివరావు, సాయి తులసీ, బిక్షపతి,ఎడ్ల మల్లేష్,గడ్డి పద్మావతి, యలమంచిలి గాంధీ,మహిళ విభాగం అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News