Monday, December 23, 2024

భువనేశ్వరి బస్సుయాత్రకు టి టిడిపి మద్దతు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ‘కార్యకర్తల కోసం నేనున్నాను’ పేరిట టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుపతి జిల్లాలో ప్రారంభిస్తున్న ఈ బస్సు యాత్రకు తాము మద్దతు తెలియజేస్తున్నామని టి టిడిపి స్పష్టం చేసింది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, దీనిని నిసరిస్తూ ‘నిజం గెలవాలి’ అని బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్న భువనేశ్వరికి సంఘీభావం తెలియజేస్తన్నామని టి టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలు షకీలారెడ్డి, మాజీ ఎంఎల్‌ఏ కాట్రగడ్డ ప్రసూన బుధవారం ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్లో మీడయా సమావేశంలో వెల్లడించారు. నారా భువనేశ్వరి బస్సు యాత్ర సఫలీకృతం కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ బస్సు యాత్ర ద్వారా ఆమె ఆందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఒక ముఖ్యమంత్రికి కూతురుగా, ఇంకో ముఖ్యమంత్రి కి భార్యగా, ఒక ఎమ్మెల్యేకు అక్కగా ఎన్నడూ రాజకీయాలలోకి రాకున్నా భువనేశ్వరి ఓ వ్యాపారినికే పరిమితమై ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ.. వస్తున్నారని,

చంద్రబాబు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి భువనేశ్వరి ఇప్పుడు బయటకు రావడం గుండెను కలచి వేస్తుందన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్భందించి 47 రోజులు అయిందని, తన భర్త బాధ్యతను స్వీకరించడమే కాక, రాజకీయశూన్యత లేకుండా నిర్వహించే ఈ యాత్రకు తాము మద్దతు తెలుపుతున్నామన్నారు. ఏపీలో అప్రకటిత కర్చ్యూను అమలు చేస్తూ.. కార్యకర్తల ధైర్యాన్ని దెబ్బ తీయాలని వైసిపి ప్రభుత్వం చూస్తున్నదని, ఓ ఝాన్సీ లక్ష్మీబాయి మాదిరి అడుగులు వేస్తున్న నారా భువనేశ్వరి వెనుక మేమున్నామని భరోసానిస్తున్నామన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో సరోజినీ నాయుడు, అనిబిసెంట్ ఎలాంటి పాత్రను పోషించారో అలాంటి పాత్రను నేడు భువనేశ్వరి పోషిస్తూ..కార్యకర్తల్లో నైరాశ్యం పోగొట్టడానికి ముందుకు వస్తున్నారన్నారు. తన బస్సు యాత్ర ద్వారా చంద్రబాబు ఆదర్శాలను భువనేశ్వరి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే మాధాపూర్‌లో హైటెక్ సిటీని చంద్రబాబు నిర్మించి 25 సంవత్సరాలు అవుతోందని, దీని ద్వారా లక్షల కుటుంబాల్లో ఉద్యోగాలతో వెలుగును తీసుకొచ్చారన్నారు. చంద్రబాబు చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని వారు పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడుని జైలు పాలు చేసి, వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతూ..వారు ఏదో సాధించామని భ్రమ పడుతున్నారని వారు మండిపడ్డారు. నిజం నిప్పులాంటిదని, కడిగిన అణిముత్యంలా చంద్రబాబు బయటికి రావడం ఖాయమని వారు పేర్కన్నారు. ఒక వైపు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే మరో వైపు కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి భువనేశ్వరి ఈ యాత్రను చేపడుతుండడం మామూలు విషయం కాదన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు బాధను దిగమింగుకుంటూ.. కార్యకర్తల కోసం వెళ్తుండడం గొప్ప విషయమన్నారు.

భువనేశ్వరి బస్సు యాత్ర కార్యక్రమంలో తెలంగాణ నుండి తాము కూడా పాల్గొంటామని వారు స్పష్టం చేశారు. ఒక వైపు తండ్రి (వైఎస్ ) చనిపోయి శవం దొరకకున్నా..ఎంఎల్‌ఏలతో సంతకాలుతీసుకున్న సంస్కృతి మీ నాయకుడిదని వైసిసిని ఉద్దేశించి వారు విమర్శించారు. నారా భువనేశ్వరి యాత్రకు తెలుగు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని ఈ బస్సు యాత్ర ఎవరికీ ఊహకు అందని యాత్ర కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో టి టిడిపి రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి బుడిగి అనూప్ కుమార్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News