Monday, December 23, 2024

టి టిడిపి తెలుగు రైతు విభాగం ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధర వచ్చేలా వ్యవసాయ సమస్యలపై తెలుగు రైతు విభాగం నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ తెలుగురైతు విభాగం నూతన రాష్ట్ర కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగింది. తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడుగా కాపా కృష్ణ మోహన్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సమావేశంలో కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ గ్రామాలలో రైతుల సమస్యల గురించి ఎంత చెప్పినా తక్కువేనని ప్రజలలోకి గ్రామాల్లో ఎంత దగ్గరకు వెళితే వ్యవసాయదారుల గురించి అంత అవగాహన వస్తుందన్నారు. ప్రస్తుత రోజులలో వ్యవసాయ పనిముట్లు కనుమరుగు కావడంతో రైతులు పండించిన వడ్లను ఆరబోసుకోవడానికి రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ క్రమంలో రైతులకు అండగా నిలబడాల్సిన అవసరముందని కాసాని పేర్కొన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని రైతు విభాగం చురుకుగా పని చేయాలని అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు విభాగనికి వెన్నంటి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు , రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు కందికంటి అశోక్ కుమార్ గౌడ్, నల్లగొండ పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జక్కిలి ఐలయ్య యాదవ్ అజ్మీరా రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News