మరింత అభివృద్ది చేయాలంటున్న వినియోగదారులు
మన తెలంగాణ/సిటీబ్యూరో : ఒకప్పుడు వి ద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయాలంటే చాంతాడంత క్యూలో గంటల తరబడినిలడాల్సి వచ్చేది. దీంతో విద్యుత్ వినియోగదారులకు ఎంతో సమ యం వృథా అయ్యేది. దాంతో పాటు కేవలం విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా త మ దైనందిత కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసుకోవాల్సి వచ్చేది. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బిల్లుల చెల్లింపుల్లో అనేక మార్పులు చ్చాయి.
దానిలో బాగంగా కొంత మంది విద్యుత్ వినియోగదారులు సమీపంలోని మీ సేవా కేంద్రాల్లో బిల్లులను చెల్లిస్తుంటుంటే మరి కొంత మంది ఆన్‌లైన్ చెల్లిస్తున్నారు. అంతే కాకుండా వినియోగదారులకు బిల్లులు చెల్లింపు ల కార్యక్రమాన్ని మరింత సులభతరంగా చేసేందుకు కొన్నియాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దాంతో చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చా లు క్షణాల్లో పే మెంట్ పూర్తవుతోంది. వీటికి తో డు ప్రభుత్వం టీ వాలెట్‌ను కూడా అందుబాటులోకి యాప్ ద్వారా ప్రభుత్వ విభాగాలకు చెంది న బిల్లులను అంటే విద్యుత్, నీటి బిల్లు చెల్లింపు లు, హెచ్‌ఎండిఏకు సంబంధించి అవుటర్ రింగ్‌రోడ్డు మీట టోలకు సంబంధించి రుసుమలతో పాటు, జిహెచ్‌ఎంకి చెల్లించాల్సిన పలురకాల సేవలకు సంబంధించిన సేవల బిల్లులు ఈ యా ప్ ద్వారా చెల్లించ వచ్చు.
గ్రేటర్‌లో హైదరాబాద్‌లో సుమారు 53 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉం డగా సుమారు గృహవిద్యుత్ వినియోగదారులు 48 లక్షలు ఉండగా మిగిలివాటిలో హెచ్‌టి,పరశ్రమలకు సంబంధించిన కనెక్షన్లు ఉన్నాయి. వీ టి ద్వారా విద్యుత్ సంస్థలకు రూ.1000 కోట్లు ఆదాయం వస్తుంది. అయితే టియాప్ ద్వారా వి ద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి సమా రు రూ. 600 కోట్లు చెల్లింపులు జరుగుతున్నా యి. విద్యుత్ బిల్లులకు సంబంధించి రూ.1000 కోట్లు ఉండగా వీటిలో సుమారు రూ.400 కో ట్లు గృహ విద్యుత్‌వినియోగదారు నుంచి వస్తుం టే మిగిలిన రూ.200 కోట్లు హెచ్‌టి,పారిశ్రామి క సంస్థలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులు చెల్లిస్తున్నారు. అయితే బిల్లుల చెల్లింపు ల ప్రక్రియ సజవుగా జరిగేందుకు ప్రభుత్వం యాప్‌లను సాయం తీసుకుంటోంది. దీని ద్వా రా సదరు యాప్‌ల నిర్వాహకులకు 2.5 మొత్తా న్ని నిర్వాహణ చార్జీల రూపంలో చెల్లిస్తోంది. ఉదాహరణకు బిల్లుల చెల్లింపుల ద్వారా రూ. 500 కోట్ల లావాదేవీలు జరిగాయనుకుంటే యాప్‌ల నిర్వహణ సంస్థలు రూ. 2.50 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఈ విధంగా ఒక్క విద్యుత్ బిల్లులు చెల్లింపుల ద్వారా యాప్ నిర్వాహణ సంస్థలకు రూ.2.50 కోట్లు పోతుంటే మిగతా మిగిలిన ప్రభుత్వ విభాగాలైన వాటర్ వర్క్, హెచ్‌ఎండి, జిహెచ్‌ఎంసి సంస్థల ద్వారా ఎంతో మొత్తం యాప్ నిర్వాహణ సంస్థలకు చార్జీలు రూపంలో పోతుందో ఇట్టే అర్దం చేసుకోవచ్చు. టీ వాలెట్‌ను మరింత అభివృద్ది చేస్తే చార్జీలు రూపంలో ఆయా సంస్థలకు వెళ్ళే ఆదాయం ప్రభుత్వానికే మిగులుతుందని, ఆ మొత్తాన్ని ఇతర అభవృద్ది కార్యక్రమాలకు వినియోగించు కోచ్చనే అభిప్రాయాన్ని వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు.