Wednesday, January 22, 2025

సూర్యకుమార్ అరుదైన ఘనత

- Advertisement -
- Advertisement -

దుబాయి: టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2023 సంవత్సానికిగానూ టి20 క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును దక్కించుకున్నాడు. దీంతో వరుసగా రెండు సార్లు ఈ అవార్డును అందుకున్న క్రికెటర్‌గా నయా చరిత్ర సృష్టించాడు. 2022లో సూర్యకుమార్ టి20 ఫార్మాట్‌లో 48.66 సగటుతో 733 పరుగులు సాధించాడు. 155.05 స్ట్రైక్‌రేట్‌తో సూర్య ఈ పరుగులు సాధించడం గమనార్హం.

2023లో సూర్యకుమార్ మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఈసారి నాలుగు అర్ధ సెంచరీలు, రెండు శతకాలను సూర్య నమోదు చేశాడు. టి20లో పరుగుల వరద పారించిన సూర్యకు ప్రతిష్టాత్మకమైన క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్ పురస్కారం దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News