Sunday, January 19, 2025

టి20 ర్యాంకింగ్స్‌: అగ్రస్థానంలో సూర్యాకుమార్ యాదవ్

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టి20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సూర్యకుమార్ 861 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్) రెండో స్థానం, మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) తర్వాతి ర్యాంకుల్లో నిలిచారు. మార్‌క్రమ్ (సౌతాఫ్రికా) ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.

భారత యువ సంచనలం యశస్వి జైస్వాల్ ఆరో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని మూడో ర్యాంక్‌లో నిలిచాడు. రవిబిష్ణోయ్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్య ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News