లండన్: పాకిస్థాన్‌తో జరిగిన నాలుగో, చివరి టి20లో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 20తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 15.3 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్‌లు జట్టుకు శుభారంభం అందించారు. ఇద్దరు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. చెలరేగి ఆడిన ఫిలిప్ సాల్ట్ 24 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 45 పరుగులు చేశాడు.
ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన జోస్ బట్లర్ 21 బంతుల్లో ఏడు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 39 పరుగులు సాధించాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 6.2 ఓవర్లలోనే 82 పరుగులు జోడించడం విశేషం. జానీ బెయిర్ స్టో 28 (నాటౌట్), హారి బ్రూక్ 17 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఇంగ్లండ్ బౌలర్లు సఫలమయ్యారు.
మార్క్‌వుడ్, ఆదిల్ రషీద్, లివింగ్‌స్టోన్ రెండేసి వికెట్లను పడగొట్టి ప్రత్యర్థి జట్టు ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. పాక్ టీమ్‌లో ఓపెనర్లు రిజ్వాన్ (23), బాబర్ ఆజమ్ (36) మెరుపు ఆరంభాన్ని అందించిన పలితం లేకుండా పోయింది. మిగతా వారిలో ఉస్మాన్ ఖాన్ (38), ఇఫ్తికార్ అహ్మద్ (21), నసీమ్ షా (16) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు.