విశాఖ : మెగా క్రికెట్ లీగ్ ఐపిఎల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లతో బిజీ బిజీ కానుంది భారత క్రికెట్ జట్టు. తొలుత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆడనుంది. ఈ సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది. తొలి టి20 ఢిల్లీ, రెండో టి20 కటక్, మూడో టి20 విశాఖ, నాలుగో టి20 రాజ్‌కోట్, ఐదో టి20 బెంగళూరు వేదికల్లో జరగనున్నాయి. అయితే ఈ నెల 14న విశాఖలో జరగనున్న మూడో టి20 మ్యాచ్‌కు అభిమానుల ఆకిడి ఇప్పటి నుంచే ప్రాంభం అయ్యింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఆన్లైన్ టిక్కెట్లను ఆదివారం ఉదయం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధికారులు అందుబాటులో ఉంచారు. కరోనా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తొలి క్రికెట్ మ్యాచ్ కావడంతో ఆన్లైన్లో పెట్టిన 10 నిమిషాలకే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఉదయం 11:30 గంటలకు రూ.600, రూ.1500, రూ.2 వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.6వేలు టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచారు. 80 శాతం టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచగా అన్నీ అమ్ముడైనట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధికారులు వెల్లడించారు. మిగతా 20 శాతం టిక్కెట్లను జూన్ 8న ఆఫ్‌లైన్‌లో వైఎస్ఆర్ ఎసిఎవిడిసిఎ స్టేడియం వద్ద మూడు కౌంటర్లలో విక్రయిస్తామని తెలిపారు. కాగా, ఈ మ్యాచ్‌కు అధికారుల భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.