- Advertisement -
టీ20 ప్రపంచకప్ 2024లో అఫ్గానిస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది. సూపర్ 8లో భాగంగా ఆదివారం ఉదయం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గాన్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బజ్(60), ఇబ్రహిమ్ జార్డన్(51)లు అర్థ శతకాలతో రాణించారు.
అనంతరం 149 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆసీస్ కు ఊహించని షాక్ ఇచ్చింది ఆఫ్గాన్. ఆ జట్టు బౌలర్లు నవీన్ ఉల్ హక్, గుల్బదిన్ నయిబ్ లు చెలరేగడంతో ఆసీస్ వరుస వికెట్లు చేజార్చుకుంది. ఈ ఇద్దరూ కీలక వికెట్లు తీసి.. ఆసీస్ వెన్ను విరిచారు. పోటీ పడి వికెట్లు తీయడంతో ఆసీస్ జట్టు 19.2 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. మ్యాక్స్ వెల్(59) ఒక్కడే రాణించాడు. దీంతో 21 పరుగుల తేడాతో ఆఫ్గాన్, ఆసీస్ ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది.
- Advertisement -