Wednesday, January 22, 2025

టి20 ప్రపంచకప్ లో బోణి కొట్టిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : టి20 వరల్డ్ కప్‌లో భారత్ శుభారంభం చేసింది. బౌలింగ్, బ్యాటింగ్‌లలో సమష్టిగా రాణించిన టీమిండియా పసికూలన ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడా విజయం సాధించింది. భారత బౌలర్లు నిప్పుల చెరిగె బంతులతో ఐర్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో 16 ఓవర్లలో కేవలం 96 పరుగులకే చాప చుట్టేసింది ఐర్లాండ్. గ్రూప్-ఏలో భాగంగా బుధవారం ఐర్లాండ్‌తో జరుగిన లీగ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు హార్దిక్ పాండ్యా(3/27), జస్‌ప్రీత్ బుమ్రా(2/6), అర్ష్ దీప్ సింగ్(2/35), మహమ్మద్ సిరాజ్(1/13), అక్షర్ పటేల్(1/3) నిప్పులు చెరిగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులు చేసింది.

ఐర్లాండ్ బ్యాటర్లలో గెరాత్ డెలానీ(14 బంతుల్లో 2×4, 2×6; 26), జోష్ లిటిల్(13 బంతుల్లో 2×4 ; 14), కర్టిస్ కాంఫెర్(8 బంతుల్లో 1×4, 1×6 ; 12) మాత్రమే రెండెంకల స్కోర్ చేయగలిగారు. మిగతా బ్యాటర్లు రాణించలేక పోయారు. అనంరతం లక్ష ఛేదనకు దిగిన టీమిండియా 12 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (52), రిషభ్ పంత్(36)లు రాణించడంతో రెండు వికెట్లు కోల్పోయి లక్షాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లీ(1), సూర్యాకుమార్ యాదవ్(2)లు విఫలమయ్యారు.

నిప్పులు చెరిగిన పాండ్య, బుమ్రా
పవర్ ప్లే అనంతరం బంతి అందుకున్న పాండ్య తొలి బంతికే వికెట్ సాధించాడు. అతని స్టన్నింగ్ డెలివరీకి లోర్కాన్ టకర్(10) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హార్దిక్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను టకార్ డ్రైవ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా ఇన్‌స్వింగ్ అయిన బంతి మిడిల్ స్టంప్‌ను తాకుతూ వెళ్లింది. బుమ్రా ఆ మరుసటి ఓవర్‌లో హ్యారీ టెక్టర్(4)ను క్యాచ్ ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్యా తన మరుసటి ఓవర్‌లో కాంఫెర్(12)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చగా.. 10వ ఓవర్‌లో సిరాజ్ డాక్‌రెల్(3)ను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు. 11వ ఓవర్ తొలి బంతికే హార్దిక్ పాండ్యా.. మార్క్ అడైర్(3) ఔట్ చేయడంతో పాటు మెయిడిన్ చేయడంతో ఐర్లాండ్ 11 ఓవర్లలో 7 వికెట్లకు 49 పరుగులే చేసింది.

ఈ పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ అక్షర్ పటేల్‌ను తీసుకురాగా.. అతను కూడా వికెట్ తీసాడు. మెక్‌కార్తీ(0)ని క్లీన్ బౌల్ చేశాడు. క్రీజులోకి వచ్చిన జోష్ లిటిల్(14), గారెత్ డెలనీ(27) దూకుడుగా ఆడి ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయ త్నం చేశాడు. అయితే జస్‌ప్రీత్ బుమ్రా స్టన్నింగ్ యార్కర్‌తో జోష్ లిటిల్(14)ని క్లీన్ బౌల్ చేశాడు. బుమ్రా తీసిన ఈ వికెట్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. జోష్ లిటిల్ ఔటైనా.. బెన్ వైట్(1)తో కలిసి గారెత్ డెలానీ పోరాడాడు. అయితే క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో డెలానీ రనౌటవ్వడంతో ఐర్లాండ్ పోరాటం ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News