Sunday, December 22, 2024

బంగ్లాపై ఘన విజయం.. సెమీస్‌లో భారత్!

- Advertisement -
- Advertisement -

అంటిగువా: టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌కు మరింత చేరువైంది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్8 మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ దాదాపు సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన బంగ్లాదేశ్ సెమీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించిందనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

ఓపెనర్లు రోహిత్ శర్మ (23), విరాట్ కోహ్లి (37) కాస్త మెరుగ్గా రాణించారు. ధాటిగా ఆడిన పంత్ 36 పరుగులు చేశాడు. శివమ్ దూబె 3 సిక్సర్లతో 34 పరుగులు సాధించాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్‌ఆడిన హార్దిక్ పాండ్య 27 బంతుల్లోనే 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ షాంటో (40), ఓపెనర్ తంజీద్ (29), రిశాద్ (24) మాత్రమే కాస్త రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ మూడు, అర్ష్‌దీప్, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News